తిరుమల: నవరాత్రి బ్రహ్మోత్సవాలను గొప్పగా నిర్వహించాలని టీటీడీ అదనపు ఈఓ వెంకయ్యచౌదరి పిలుపునిచ్చారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో విధులు కేటాయించిన టీటీడీ ఉద్యోగులతో శుక్రవారం సాయంత్రం తిరుమల ఆస్థాన మండపంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను సమన్వయంతో నిర్వహించామని, ఈ విజయం ఉద్యోగుల అందరిదని చెప్పారు. జేఈవో డాక్టర్ శరత్ మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది కలిసి టీమ్ వర్క్‌గా పని చేయడం వల్ల గత బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యాయన్నారు. సీవీఎస్‌ఓ మురళీకృష్ణ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల భద్రత చాలా కీలకమన్నారు. సమావేశంలో జేఈవో(విద్య, వైద్యం) గోపీనాథ్, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.


