ఉద్యోగాల్లో వెనుకబడి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల్లో వెనుకబడి

Oct 10 2026 1:22 AM | Updated on Oct 10 2026 1:22 AM

● కూటమి పాలనలో దగాపడ్డ బీసీ నిరుద్యోగులు ● బీసీ నిరుద్యోగుల భవిష్యత్‌ అంధకారం ● చంద్రబాబు రిజర్వేషన్‌ నాటకం గుట్టు రట్టు ● తిరగబడేందుకు సిద్ధమవుతున్న బీసీ నిరుద్యోగులు ● లెక్కలే చెబుతున్నాయి కూటమి ‘వంచన’! ● మెగా డీఎస్సీలో వెనుకబాటే ● కానిస్టేబుల్‌ పోస్టుల్లో అన్యాయం

చిత్తూరు కలెక్టరేట్‌ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సింహభాగం ఉన్న బీసీల ఓట్లతో గెలిచిన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారికి వెన్నుపోటు పొడిచింది. నిరుద్యోగ బీసీల భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టేసింది. అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారమే క్రమం తప్పకుండా పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే హామీలన్నింటిని మరిచిపోయింది. అసలు ‘జాబ్‌ క్యాలెండర్‌’ అనే పదమే లేకుండా చేసి నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టింది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశపడ్డ బీసీ యువతకు చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిరాశే మిగిల్చింది.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఉద్యోగాల భర్తీ గణాంకాలను పరిశీలిస్తే చంద్రబాబు ప్రభుత్వం బీసీలపై చూపుతున్న పక్షపాతం తేటతెల్లమవుతోంది.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో డీఎస్సీ ద్వారా 1,473 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వగా, 1,403 పోస్టులు భర్తీ చేశారు. కానీ అందులో బీసీలకు దక్కింది కేవ లం 424 పోస్టింగ్‌లు మాత్రమే.

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో 980 పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇస్తే, అందులో బీసీ వర్గాలకు దక్కినవి కేవలం 42 పోస్టులే!

ఈ రెండు విభాగాల్లో దక్కిన అరకొర పోస్టులు తప్ప, కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లల్లో బీసీలకు కొత్తగా ఒక్కటంటే ఒక్క ఉద్యోగ అవకాశం కూడా కల్పించలేదు. ఇది బీసీ యువత పట్ల చూపు తున్న స్పష్టమైన వివక్ష కాదా అని ఆ సామాజికవర్గ నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

అత్యధిక జనాభా ఉన్నా అణచివేతే?

ఉమ్మడి చిత్తూరు జిల్లా సమగ్ర జనాభా లెక్కలను పరిశీలిస్తే మొత్తం జనాభా 41.74 లక్షలు (పురుషులు: 20.90 లక్షలు, మహిళలు: 20.84 లక్షలు) ఉన్నారు. కుటుంబాలు 10.40 లక్షలు (గ్రామీణ ప్రాంతాల్లో 7.37 లక్షల కుటుంబాలు, పట్టణ ప్రాంతాల్లో 3.03 లక్షల కుటుంబాలు) ఉన్నాయి. బీసీ జనాభా, ఓటర్లు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీసీ జనాభా 17,88,406 ఉండగా, అందులో ఏకంగా 15,18,405 మంది బీసీ ఓటర్లే ఉన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సింహభాగం ఉన్న బీసీ సమాజం ఏకమై ఓట్లేసి గెలిపిస్తే, ఆ బీసీల భవిష్యత్తును చంద్రబాబు ప్రభుత్వం అంధకారంలోకి నెట్టేసింది. మెజారిటీ ఉన్న వర్గానికి ఉద్యోగావకాశాల్లో మొండిచేయి చూపించడం ఎంతవరకు సమంజసం అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

కుప్పకూలిన రిజర్వేషన్ల కొత్త డ్రామా

బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు నాయుడు ఆడుతున్న నాటకాలు మళ్లీ బయటపడ్డాయి. బీసీల రిజర్వేషన్లు పెంచుతున్నామని ప్రకటనలు గుప్పించి, దానికి సంబంధించిన శ్రీడెడికేటెడ్‌ కమిషన్‌శ్రీ నివేదికను మాత్రం బయటపెట్టకుండానే జీవోలు జారీచేశారు. న్యాయపరమైన రక్షణ లేకుండా, ఎలాంటి అధ్యయనం లేకుండా ఇచ్చిన ఈ జీవోలపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నివేదిక లేకుండా జీవోలు ఎలా ఇస్తారని కోర్టు ప్రశ్నించడంతో చంద్రబాబు ఆడిన రిజర్వేషన్ల డ్రామా గుట్టు రట్టయ్యింది. బీసీలకు నిజంగా మేలు చేయడం చంద్రబాబు ఉద్దేశం కాదని, కేవలం కోర్టుల పేరు చెప్పి రిజర్వేషన్లు రాకుండా అడ్డుకోవడమే ఆయన పన్నాగమని స్పష్టమవుతోంది.

చంద్రబాబు ప్రభుత్వం అధికార పీఠం దక్కించుకోవడానికి ఎన్నికల ముందు బీసీలకు వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తామని, అండగా ఉంటామని కపట హామీలిచ్చింది. అధికారంలోకి వచ్చాక తీవ్రంగా మోసం చేసింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు ఆడిన కపట నాటకం తేటతెల్లమైంది. బీసీ రిజర్వేషన్లు పెంచుతున్నామని జీవోలు జారీచేసిన ప్రభుత్వం, డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదికను మాత్రం బహిర్గతం చేయకుండా తొక్కిపెట్టింది. హామీలు అమలు చేయకపోవడంపై బీసీ నిరుద్యోగ యువత మండిపడుతోంది.

ఉద్యోగాల భర్తీలో బీసీలకు అన్యాయం

ఉమ్మడి చిత్తూరు జిల్లా గణాంకాలు

ఉమ్మడి చిత్తూరు జిల్లా మొత్తం జనాభా

41.74 లక్షలు

పురుషుల జనాభా 20.90 లక్షలు

మహిళల జనాభా 20.84 లక్షలు

మొత్తం కుటుంబాల సంఖ్య 10.40 లక్షలు

గ్రామీణ కుటుంబాలు 7.37 లక్షలు

అర్బన్‌ కుటుంబాలు 3.03 లక్షలు

ఉమ్మడి చిత్తూరు జిల్లా బీసీ జనాభా

17,88,406

ఉమ్మడి చిత్తూరు జిల్లా బీసీ ఓటర్లు

15,18,405

బీసీలకు

దక్కిన

పోస్టులు

424

42

మొత్తం

నోటిఫికేషన్‌ పోస్టులు

1,473

980

ఉద్యోగ

ప్రకటన

డీఎస్సీ

పోలీస్‌ కానిస్టేబుల్‌

బీసీ నిరుద్యోగుల పొట్టకొడుతున్న బాబు ప్రభుత్వం!

ఎన్నికలకు ముందు బీసీల జపం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం, తీరా గెలిచాక నిరుద్యోగుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసింది. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామన్న హామీ ఏమైంది? గత ప్రభుత్వ హయాంలో దాదాపు పూర్తయిన కానిస్టేబుల్‌ ఉద్యోగాలను తమ ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లక్షలాది మంది బీసీ యువత ఉంటే, డీఎస్సీ, కానిస్టేబుల్‌ భర్తీల్లో చూపించిన వివక్ష దారుణం. డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదికను పక్కనపెట్టి రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు ఆడిన నాటకం కోర్టు దెబ్బకు గుట్టు రట్టయ్యింది. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్ళు తెరచి ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలి, లేకపోతే బీసీ విద్యార్థి, నిరుద్యోగ లోకం ఏకమై కూటమి సర్కారుకు తగిన గుణపాఠం చెబుతుంది. – శివారెడ్డి, ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement