తిరుపతి తుడా: కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నాతో రుయా ఆస్పత్రి దద్ధరిల్లింది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం రుయాలో వందలాది మంది నర్సులు, పారామెడికల్ సిబ్బందితో పాటు ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగులు పెద్ద ఎత్తున నల్లబ్యాడ్జీలు ధరించి మౌనవత్రం పాటిస్తూ నిరసనకు దిగారు. వారు మట్లాడుతూ ప్రభుత్వం తక్షణం తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
స్తంభించిన వైద్య సేవలు
కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మెతో వైద్య సేవల కోసం విచ్చేసిన పేద రోగులకు ఇబ్బందులు తప్పలేదు. ఆస్పత్రిలో వైద్య సేవల విషయంలో నర్సింగ్ సిబ్బంది ప్రధాన పాత్ర పోషిస్తారు, అలాంటి వారు సమ్మెలో ఉండడంతో రుయాలోని పలు విభాగాలల్లో వైద్య సేవలు స్తంభించాయి.


