మహిళా న్యాయవాదిపై జనసేన నేత లైంగిక దాడి | Female lawyer files police complaint against Jana Sena leader | Sakshi
Sakshi News home page

మహిళా న్యాయవాదిపై జనసేన నేత లైంగిక దాడి

Oct 10 2026 5:14 AM | Updated on Oct 10 2026 5:14 AM

Female lawyer files police complaint against Jana Sena leader

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: చిత్తూరులో జనసేన పార్టీకి చెందిన ఓ న్యాయవాది, తనతో పనిచేసే ఓ జూని­యర్‌ మహిళా న్యాయవాదిపై లైంగికదాడి చేసినట్లు శుక్రవా­రం పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇప్పటికే పెళ్లయిన అతను, తన భార్యతో విడిపోయి, పలు న్యాయపరమైన వివాదాలను ఎదు­ర్కొంటున్నా­డు. ఇలాంటి తరుణంలో పెళ్లికాని ఓ యువతిని నమ్మించి, చేర­దీసి చంద్రగిరి సమీపంలో తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే జరిగిన ఘటన చంద్రగిరిలో కావడంతో ఎఫ్‌ఐఆర్‌ వేయడానికి పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమో­దు­చేసి, కేసును చంద్రగిరి స్టేషన్‌కు బదిలీ చేసే యోచనలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement