సత్కారం పొందిన న్యాయమూర్తులతో హైకోర్టు న్యాయవాదుల సంఘం
ఘనంగా సన్మానించిన హైకోర్టు న్యాయవాదుల సంఘం
సాక్షి, అమరావతి: హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులైన న్యాయమూర్తులు జస్టిస్ కుంచెం మహేశ్వరరావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్, జస్టిస్ చల్లా గుణరంజన్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ, జస్టిస్ డాక్టర్ యడవల్లి లక్ష్మణరావులను హైకోర్టు న్యాయవాదుల సంఘం ఘనంగా సన్మానించింది. శుక్రవారం హైకోర్టు న్యాయవాదుల అసోసియేషన్ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో వీరిని న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్ శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు బహూకరించారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు పీటా రామన్, ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి కిరణ్, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.


