కలువాయి(సైదాపురం): గ్రామాల్లో చెత్త సేకరించుకుంటున్న నెపంతో కొందరు మహిళలు ముఠాగా ఏర్పడి చిన్న పిల్లలని టార్గెట్ చేస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నాలుగు రోజుల కిందట కలువాయి మండలం పెన్న బద్వేలులో చెత్త ఏరుకుంటూ సంచరిస్తున్న నగురులు మహిళలు పెన్న బద్వేల్ పాత ఊరు ఎస్సీ కాలనీలో తుమ్మల రమేష్ కుమార్తెకు చాక్లెట్లు ఇస్తూ చూట్టూముట్టడంతో ఆ బాలిక కేకలు వేయడంతో కాలనీ వాసులు అక్కడకు చేరుకుని గుర్తు తెలియని మహిళలను అడ్డగించారు. అయితే వారు సమీపంలో ఉన్న ఆటో ఏక్కి పరాయ్యారని కాలనీ వాసులు తెలిపారు.


