తిరుపతి కల్చరల్: శ్రీకోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శనివారం రాత్రి లోకాభిరాముడు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు కటాక్షించారు. ఉదయం 8 స్వామివారి పల్లకీ సేవ వేడుకగా సాగింది. ఈ సందర్భంగా మోహినీ అవతారంలో శ్రీరామచంద్రమూర్తి పల్లకీలో కొలువై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఉదయం 9.30 గంటలకు గరుడ పాదుకల ఊరేగింపు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఘనంగా నిర్వహించారు. అనంతరం 10 నుంచి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, ఆలయ డిప్యూటీ ఈఓ నాగరత్న, ఏఈఓ రవి, సూపరింటెండెంట్ మునిశంకర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ సురేష్ పాల్గొన్నారు.
శ్రీకోదండరామునికి గొడుగులు
శ్రీభాష్యకార కై ంకర్య ట్రస్ట్ వారు శ్రీకోదండరామస్వామివారికి శనివారం నాలుగు గొడుగులు కానుగా అందజేశారు. తమిళనాడుకు చెందిన శ్రీభాష్యకార కై ంకర్య ట్రస్ట్ అధ్యక్షుడు మాధవ నాయుడు, ఫౌండర్ ట్రస్టీ దినేష్‌కుమార్ ఆధ్వర్యంలో ఈ గొడుగులు తీసుకొచ్చి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ నాగరత్నకు అందజేశారు.


