వైభవంగా మత్స్య జయంతి | - | Sakshi
Sakshi News home page

వైభవంగా మత్స్య జయంతి

Mar 22 2026 1:27 AM | Updated on Mar 22 2026 1:27 AM

● గరుడవాహనంపై స్వామివారి విహారం

నాగలాపురం: మండలంలోని శ్రీదేవి, భూదేవి సమేత వేదనారాయణ స్వామి ఆలయంలో మత్స్య జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు నాగు, దొరై, దేవరాజ్‌ భట్టాచార్యులు వేకువ జామున ఆలయాన్ని శుద్ధి చేసి, మూలవర్లకు నిత్య కై ంకర్యాలు పూర్తి చేసి, దీప దూప నైవేద్యాలు సమర్పించారు. ఉదయం 7.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణ స్వామి ఉత్సవమూర్తులను తిరిచ్చి వాహనంపై కొలువుదీర్చి గ్రామోత్సవం నిర్వహించారు. మత్స్య జయంతి సందర్భంగా మత్స్య కారులు మాల ధరించి, ఇరుముడులతో గ్రామోత్సవంలో పాల్గొన్నారు. తరువాత రాములవారి మండపంలో మహా శాంతి హోమం నిర్వహించి, స్వామి వారికి స్నప తిరుమంజనం చేసి, అభిషేక జలాన్ని భక్తులపై చల్లారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఆలయ ప్రాంగణలో అన్నదానం ఏర్పాటు చేశారు. రాత్రి 8 గంటలకు గరుడవాహనంలో స్వామివారి ఉత్సమూర్తులు కొలువదీరి తిరువీధుల్లో ఊరేగారు. సూపరింటెండెంట్‌ శంకరయ్య, ఆలయాధికారులు శ్రీనివాసులు, చెంగల్‌రాయులు, ఉదయ్‌ కుమార్‌, ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement