నాయుడుపేట పట్టణానికి చెందిన కొత్త అల్లుడు పఠాన్ ఆరాఫత్‌కు ఆయన అత్తమామలు గౌస్‌బాషా, షాహినా దంపతులు షడ్రుచులతో కూడిన 60 రకాల వంటలతో విందు పెట్టారు. గౌస్‌బాషా, షాహినా దంపతుల కుమార్తె షామిదకు ఇటీవల పఠాన్ అరాఫత్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో రంజాన్ పండుగ సందర్భంగా కొత్త అల్లుడికి మటన్, చికెన్, రొయ్యల బిర్యానీతోపాటు మటన్, చికెన్ హలీమ్‌లు, వివిధ రకాల వంటలు, స్వీట్లు తదితరాలను ప్రత్యేకంగా తయారు చేసి విందు భోజనం పెట్టారు. అల్లుడు, కూతురిపై తమకున్న అభిమానన్ని చాటుకున్నారు.
– నాయుడుపేట టౌన్


