ఈద్‌ ముబారక్‌ | - | Sakshi
Sakshi News home page

ఈద్‌ ముబారక్‌

Mar 22 2026 2:07 AM | Updated on Mar 22 2026 2:07 AM

● భక్తిశ్రద్ధలతో రంజాన్‌ సంబరాలు ● నమాజ్‌లతో పులకించిన ఈద్గా, దర్గాలు

ఈద్గా మైదానంలో నమాజ్‌ చేస్తున్న ముస్లింలు

నెల‘రోజా’లు భక్తిశ్రద్ధలతో సాగిన దీక్షలు శుక్రవారం నెలవంక తొంగి చూడడంతో జిల్లా వ్యాప్తంగా ముస్లింలు సమత, మమతల కలయిక, దానధర్మాలకు ప్రతీకగా నిలిచే రంజాన్‌ పండుగను శనివారం వైభవంగా జరుపుకున్నారు. ఈద్గాలకు ర్యాలీగా వెళ్లి సామూహికంగా నమాజ్‌ చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్‌ ముబారక్‌ చెప్పుకున్నారు. పండుగపూట బంధుమిత్రులు విందు భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. తమకు తోచిన ధాన ధర్మాలు చేస్తూ తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. తిరుపతి ఎస్వీయూనివర్శిటీ సమీపంలోనున్న ఈద్గా మైదానంలో రంజాన్‌ వేడులను ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకున్నారు. – తిరుపతి కల్చరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement