పెట్రోల్‌తో కలెక్టరేట్‌కు వచ్చిన దంపతులు
తొట్టంబేడు మండలంలోని శ్రీకృష్ణాపురం రెవె న్యూ పరిధిలో భూ సమస్య పరిష్కారానికి ఆరు నెలలుగా తిరుగుతున్న ఎస్.వీరాస్వామి, అమరావతి దంపతులు సోమవారం కలెక్టరేట్ గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారి కుమారుడు ప్రేమ్‌కుమార్ ఓ కట్టెల సంచిలో పెట్రోల్ క్యాన్ ఉంచారని, ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడడానికి సిద్ధమయ్యారని పోలీసులకు ముందుగా సమాచారం అందింది. దీంతో పోలీసులు వారి వద్దకు వెళ్లి పెట్రోల్ ఉన్న క్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమాచారాన్ని తెలుసుకున్న కలెక్టర్ వెంకటేశ్వర్ భార్యభర్తలను పిలిపించి, వారి భూమికి సంబంధించిన లోటుపాట్లును వివరించారు. మరోవైపు తిరుచానూరు పోలీసులు వారిపై కేసును నమోదు చేయడానికి తమ పోలీస్‌స్టేషన్‌కు తీసుకుపోయారు.


