‘మనోబంధు’ పోస్టర్ ఆవిష్కరణ
తిరుపతి అర్బన్ : మానసిక సమస్యలతో బాధపడుతూ రహదారులపై తిరుగుతున్న వారిని గుర్తించి రక్షణ కల్పించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో సోమవారం మనోబంధు కార్యక్రమం పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు, జిల్లా కార్యదర్శి డాక్టర్ జి.ప్రథీత్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ బాలకృష్ణనాయక్ పాల్గొన్నారు. అలాగే ఐదేళ్లలోపు పిల్లల్లో న్యుమోనియాను నివారణకు సమష్టిగా కృషి చేద్దామని కలెక్టర్ పిలుపునిచ్చారు. ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీ, డీఎంహెచ్‌ఓ బాలకృష్ణనాయక్‌తో కలసి అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 12 నుంచి న్యుమోనియా నివారణపై పిల్లలు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి శాంతకుమారి, డీపీహెచ్‌ఎన్‌ఓ మంజుల, డిప్యూటీ డెమో అధికారి షేక్ ఖాజావలీ, మురళి పాల్గొన్నారు. ఈ క్రమంలోనే జిల్లాను కుష్టు వ్యాధి రహితంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ మేరకు అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 17 నుంచి 30 వరకు కుష్టు నివారణకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. టీబీ, కుష్టు నివారణ అధికారి శైలజ, డీఐఓ శాంతకుమారి, డీఎన్‌ఎం డాక్టర్ రాజా, ఫిజియోథెరపిస్ట్ వెంకటరమణ పాల్గొన్నారు.


