ఎంబీయూను సందర్శించిన పెన్ యూనివర్సిటీ ప్రతినిధులు
చంద్రగిరి: మండలంలోని మోహన్‌బాబు యూనివర్సిటీ(ఎంబీయూ)ను ఆమెరికాలోని పెన్ స్టేట్ యూనివర్సిటీ ప్రతినిధులు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడి కోసం ఎంబీయూ ప్రతినిధులతో చర్చించారు. రెండు యూనివర్సిటీల మధ్య సహకార సంబంధాలు మరింత బలోపేతం దిశగా చర్చలు నిర్వహించినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. భాగస్వామ్యంలో భాగంగా విద్యార్థులు ప్రారంభ సంవత్సరాలను ఎంబీయూలో పూర్తి చేసి, తర్వాత పెన్ స్టేట్ యూనివర్సిటీలో ఉన్నత చదువులు కొనసాగించేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఉమ్మడి డిగ్రీ ప్రోగ్రామ్‌లు, స్కాలర్‌షిప్, ఆర్థిక సాయం వంటి అవకాశాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫసర్ వెంకటరామన్, అమండా లూట్, వెండి మోయ్నిహాన్, ఎంబీయూ వీసీ నాగరాజ్ రామారావు, రిజిస్ట్రార్ సారథి, డీన్ అకాడమిక్స్ డాక్టర్ రమణ తదితరులు పాల్గొన్నారు.
పటిష్టంగా క్యూల నిర్వహణ
తిరుమల: తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌పై సోమవారం ఉదయం టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, సీవీఎస్‌ఓ మురళీకృష్ణతో కలిసి సమీక్షించారు. ఆయన మాట్లాడు తూ క్యూల నిర్వహణను మరింత పటిష్టం చేసేందుకు సీసీ కెమెరాలను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానం చేయాలని ఆదేశించారు. క్యూలో భక్తుల సంఖ్య, కదలికలపై గణాంకాలను ఎప్పటికప్పుడు వి శ్లేషించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ఐటీ విభాగానికి కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పించాలని సూచించారు. ప్రస్తుత సాప్ట్ వేర్ ను మరింతగా అప్‌గ్రేడ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీటీడీ ఐటీ జీఎం ఫణి కుమార్ నాయుడు, డిప్యూటీ ఈఓ లోకనాథం, వీజీఓలు రామ్ కుమార్, సురేంద్ర, డీజీఎం(ఐటీ) వెంకటేశ్వర నా యుడు, కార్య ఫౌండేషన్ ప్రతినిధులు జయ ప్రసాద్, రవి పాల్గొన్నారు.
ఎంబీయూను సందర్శించిన పెన్ యూనివర్సిటీ ప్రతినిధులు


