పూలంగిసేవలో పార్వతీ పరమేశ్వరులు
● నేడు త్రిశూల స్నానంతో ఉత్సవాలు పరిసమాప్తి
చంద్రగిరి: తొండవాడ స్వర్ణముఖీ నది ఒడ్డున శ్రీఅగస్తేశ్వరస్వామి(ముక్కోటి) ఆలయంలో నిర్వహిస్తున్న రుద్రపాదాల ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు, ప్రత్యేక అలంకరణ, ఆలయ పరివార దేవతలైన శ్రీరామచంద్రమూర్తి, శ్రీవేణుగోపాలస్వామిలకు అభిషేక సేవను నిర్వహించారు. అనంతరం స్వామివారు అధికార నంది వాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఆ తర్వాత పుష్పయాగం కనుల పండువగా నిర్వహించారు. రాత్రి స్వామివారు రావణా సుర వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ధర్మకర్త మొగిలి రఘురామిరెడ్డి, సిబ్బంది పర్యవేక్షించారు. సోమవారం త్రిశూల స్నాన ఘట్టం, సాయంత్రం 6 గంటలకు ధ్వజావరోహణంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి.


