● బకాయిలు చెల్లించాలని ధర్నా
మామిడి రైతుల నిరసన
పాకాల : మండలంలోని ఉప్పరపల్లి పంచాయతీ రామిరెడ్డి ఇండ్లు సమీపంలో ఉన్న సుప్రీమ్ క్వాలిటీ ఫుడ్ ప్రాడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ వద్ద మామిడి రైతులు నిరసన తెలిపారు. బకాయిలు చెల్లించాలంటూ సోమవారం ధర్నాకు దిగారు. జిల్లా మామిడి రైతుల సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ ఆనంద నాయుడు మాట్లాడుతూ మామిడి కేజీకి రూ.8 చెల్లిస్తామని కొనుగోలు చేసి, రూ.4 మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కేజీకి రూ.8 ప్రకారం మామిడి రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. సుమారు 765 మంది రైతులు 3,656 టన్నులు మామిడిని ఫ్యాక్టరీకి అమ్మినట్లు వెల్లడించారు. వెంటనే బకాయిలను చెల్లించాలని ఫ్యాక్టరీ మేనేజర్‌కు వినతిపత్రం అందించారు. నేతలు హరిబాబు చౌదరి, లవకుమార్‌రెడ్డి, చంద్రమౌళి, పద్మనాభనాయుడు, రమేష్‌నాయుడు పాల్గొన్నారు.


