చిరుత సంచారంపై ఆందోళన వద్దు
తిరుపతి అన్నమయ్యసర్కిల్: నగరంలోని మంగళం ప్రాంతంలో చిరుతపులి సంచారంపై స్థానికులు ఆందోళన చేయాల్సిన అవసరం లేదని జి ల్లా అటవీశాఖాధికారి (డీఎఫ్‌ఓ) సాయిబాబు పేర్కొన్నారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎక్కడైనా చిరుతల సంచారం గురించి తెలిస్తే సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేయవచ్చన్నారు. అలాగే మొబైల్ ఫోన్ల ద్వా రా సమాచారం అందించవచ్చన్నారు. ఇప్పటికే 15 మందితో ఓ బృందం ఏర్పాటు చేసి, చిరుత కదలికలు గమనిస్తున్నట్లు తెలిపారు. అలిపిరి నడకమార్గంలో మరింత కాంతి వంతంగా లైటింగ్ ఏర్పాటు చేశామన్నారు. అలాగే అలిపిరి నడక మార్గంలో 10 మంది, యూనివర్సిటీ పరిధిలో ఐదుగురు ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ఇన్ఫ్రార్డ్ కెమెరాలు సైతం ఏర్పాటు చేసి చిరుత కదలికలు పరిశీలిస్తున్నట్ల చెప్పారు. ఎక్కువగా వ్యర్థాలు అనేక ప్రాంతాల్లో డంప్ చేయడం వల్లే చిరుతలు వస్తున్నాయనడంలో సందేహం లేదన్నారు. డంప్‌లో ఆహారం కోసం కుక్కల, ఎలుకలు అధికంగా వస్తుండడంతో వాటిని ఆహారంగా తీసుకోవడానికి చిరుతలు ఆ ప్రాంతాల్లో ఎక్కువగా సంచరిస్తున్నట్లు తెలిపారు.
రెండు టిప్పర్లు సీజ్
చంద్రగిరి: అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న రెండు టిప్పర్లను మైనింగ్ శాఖ అధికారులు సీజ్ చేశారు. కొద్ది రోజులుగా చంద్రగిరి మండల సమీపంలోని ఇతర మండలాల నుంచి గ్రావెల్‌ను చంద్రగిరి మీదుగా అక్రమంగా తరలిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం అర్థరాత్రి గ్రావెల్‌ను తరలిస్తున్న రెండు టిప్పర్లను మైనింగ్ అధికారులు, నూర్ జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వాహనాలను పోలీసులకు అప్పగించి, కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
చిరుత సంచారంపై ఆందోళన వద్దు


