ప్రసూతి ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స
తిరుపతి తుడా: ఎస్వీ వైద్య కళాశాల ప్రసూతి ఆస్పత్రిలో మంగళవారం సూపరింటెండెంట్ డాక్టర్ ప్రమీలాదేవి, ప్రొఫెసర్ డాక్టర్ అరుణ బృందం అరుదైన శస్త్రచికిత్స చేసి, ప్రశంసలు పొందారు. 33వ ఏళ్ల మహిళకు 28 సెంటీమీటర్ల కణితిని గర్భసంచి నుంచి తొలగించారు. ఈ సందర్భంగా వైద్య బృందాన్ని ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి రవిప్రభు ప్రత్యేకంగా అభినందించారు. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద అరుదైన శస్త్రచికిత్స చేయడంతో వైద్యబృందానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
గిరిజనుల సమస్యలపై
కలెక్టర్ సమీక్ష
తిరుపతి అన్నమయ్యసర్కిల్: జిల్లాలోని కోట, వాకాడు, చిల్లకూరు, గూడూరు, డీవీ సత్రంలోని మండలాలకు సంబంధించిన గిరిజనుల సమస్యలపై కలెక్టర్ డార్టర్ ఎస్ వెంకటేశ్వర్ సమీక్షించారు. మంగళవారం కలెక్టరేట్‌లో గిరిజనుల సమస్యలపై తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చైల్డ్ లేబర్ అడ్వైజరీ బోర్డు మెంబర్ బషీర్‌తో కలిసి చర్చించారు. జెడ్పీ సీఈఓ రవి నాయుడు, డీఈఓ కేవీఎన్ కుమార్, డీఎంఅండ్‌హెచ్‌ఓ బాలకృష్ణ నాయక్, డీపీఓ సుశీలాదేవి, డీఆర్‌డీఏ పీడీ శోభన్ బాబు, మెప్మా పీడీ శ్రీనివాస ప్రసాద్, జిల్లా మైన్స్ అధికారి బాలాజీ నాయక్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రాజా సోము పాల్గొన్నారు.


