రాపిడో బైక్ డ్రైవర్‌పై కేసు నమోదు
● తహసీల్దార్‌కు బైండోవర్
తిరుపతి క్రైమ్ : మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన రాపిడో బైక్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు అలిపిరి సీఐ రామకిషోర్ తెలిపారు. వివరాలు.. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్‌ఆర్ కాలనీలో బ్యూటీ పార్లర్ నిర్వహించే ఓ మహిళ శనివారం రాత్రి 12:30 గంటల సమయంలో అంకుర హాస్పిటల్ వెనుక తన ఇంటికి వెళ్లేందుకు రాపిడో బైక్ సర్వీస్ బుక్ చేసుకున్నారు. ఆమెను ఇంటి వద్దకు చేర్చిన రైడర్ పెద్దయ్య అనే వ్యక్తి బలవంతంగా ఆమె జుట్టు పట్టుకుని దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టుకున్నాడు. బాధితురాలు కేకలు వేయడంతో ఆమె భర్త, బంధువులు వెంటనే అక్కడికి చేరుకుని బైక్ రైడర్‌ను పట్టుకున్నారు. అదే సమయంలో నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సీఐ రామకిషోర్ అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు పెద్దయ్యపై కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడికి కౌన్సెలింగ్ ఇచ్చి, భవిష్యత్తులో ఎప్పుడూ ఇలా ప్రవర్తించకూడదని తిరుపతి తహసీల్దార్‌కు ఏడాదిపాటు బైండోవర్ చేసినట్లు సీఐ వివరించారు.
ముగిసిన ‘పిల్లల పండుగ’
తిరుపతి కల్చరల్ : రోటరీ క్లబ్ సహకారంతో తిరుపతి బాలోత్సవంవారు ఎస్‌జీఎస్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో రెండు రోజుల పాటు నిర్వహించిన పిల్లల పండుగ ఆదివారం సాయంత్రంతో ఘనంగా ముగిసింది. పండుగలో సుమారు 35 అంశాలలో వివిధ వేదికలపై కోలాహలంగా పోటీలు సాగాయి. పిల్లల సందడి, నృత్యాలు, క్విజ్, చదరంగం, జానపద, శాసీ్త్రయ నృత్యాలు, దేశ భక్తి గీతాలాపనలు, చిత్రలేఖనం, ఏకపాత్రాభినయాలు, యోగా వంటి ప్రదర్శనలతో మైదానం హోరెత్తింది. ముగింపు సందర్భంగా వివిధ పోటీల విజేతలకు బహుమతులు ప్రదా నం చేశారు. తిరుపతి బాలోత్సవం వ్యవస్థాపకుడు మల్లారపు నాగార్జున మాట్లాడుతూ నాలుగేళ్లుగా పిల్లల పండుగ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ ఏడాది 11 వేల మంది విద్యార్థులు బాలోత్సవంలో పాల్గొనడం మరింత సంతోషంగా ఉందని వివరించారు. ఇదే ఉత్సాహంతో రాబోయే సంవత్సరం అత్యంత వైభవంగా బాలోత్సవం నిర్వహిస్తామని తెలిపారు.సాహితీ వేత్తలు సాకం నాగరాజు, గార్లపాటి దామోదర నాయుడు, జీఎన్ రెడ్డి, ఏనుగు అంకమనాయుడు, మణికంఠ ప్రసంగించారు. కార్యక్రమంలో నిర్వాహకులు నడ్డినారాయణ, రెడ్డెప్ప, గురునాథం, మునిలక్ష్మి, మన్నవ గందాధర ప్రసాద్, నెమిలేటి కిట్టన్న, యువశ్రీ మురళి, పేరూరు బాలసుబ్రమణ్యం, తహసున్నీసా బేగం, గొడుగుచింత గోవిందయ్య, షాజహాన్ పాల్గొన్నారు.


