వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేతలు
బుచ్చినాయుడుకండ్రిగ : మండలంలోని కంచనపుత్తూరుకు చెందిన 20 మంది టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆదివారం ఈ మేరకు నిర్వహించిన కోటి సంతకాల సేకరణలో భాగంగా గ్రామానికి వచ్చిన వైఎస్సార్‌సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్, మండల కన్వీనర్ కొణతనేని మణినాయుడు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీలో చేరిన నేతలు తిరుపాలఆచ్చారి, రాజేంద్రఆచ్చారి, ప్రతాప్, భాస్కరయ్య, నాగరాజు, మణి, సుబ్రమణ్యం, గురునాథం, మునెయ్య, వెంకటమ్మ, ముత్యాలమ్మ, చంద్రయ్య, బాలగురవయ్య, జ్ఞానమ్మ, పోలయ్య, కృష్ణయ్య, వెంకటరమణ, రామ్మూర్తి మాట్లాడుతూ జగనన్న పాలనలోనే బీసీలకు మేలు చేకూరిందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ స్వప్న, మాజీ సర్పంచ్ గురవయ్య, స్థానిక నేత చిట్టేటి చంద్రశేఖర్ పాల్గొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
