
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి పట్టణానికి సమీపంలోని మిట్టకండ్రిగ వద్ద బుధవారం ద్విచక్ర వాహనాన్ని టాటా ఏస్ వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఒకటవ పట్టణ పోలీసుల కథనం మేరకు.. రేణిగుంటకు చెందిన రాజ్‌కిరణ్ (30), మహేష్ అనే యువకులు బుధవారం ద్విచక్ర వాహనంపై శ్రీకాళహస్తికి వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం రేణిగుంటకు వస్తుండగా ఎదురుగా వస్తున్న టాటా ఏస్ వాహనం ద్విచక్రవాహన్ని ఢీకొనడంతో రాజ్‌కిరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మహేష్ స్వల్పంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని శ్రీకాళహస్తి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు శవ పరీక్షల కోసం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన టాటా ఏస్ డ్రైవర్ జగదీష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.