
ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాపాడుకుందాం
తిరుపతి మంగళం : పేదలకు ఉచిత వైద్యం, పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్యను అందించేందుకు జగనన్న నిర్మించిన మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం కాకుండా కాపాడుకుందామని వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయం వద్ద గురువారం నేడు చలో మదనపల్లె మెడికల్ కాలేజ్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆరె.అజయ్‌కుమార్, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మల్లం రవికుమార్, జిల్లా, నగర అధ్యక్షుడు ఉదయ్‌వంశీ, దినేష్‌రాయల్, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గీతాయాదవ్, టౌన్‌బ్యాంక్ వైస్ చైర్మన్ వాసుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
‘చలో మెడికల్ కాలేజీ’ని విజయవంతం చేయండి
వెంకటగిరి (సైదాపురం) : ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ ఈనెల 19వ తేదీన నిర్వహించనున్న చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. యువజన, విద్యార్థి విభాగం నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని కోరారు.
జయప్రదం చేయండి
తిరుపతి సిటీ: కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడం దారుణమని వైఎస్సాఆర్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఓబుల్ రెడ్డి అన్నారు. విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చలో మదనపల్లె మెడికల్ కళాశాల కార్యక్రమం చేపట్టామని ఆ సంఘం తెలిపారు. పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు.
చలో మదనపల్లెకు తరలిరండి
తిరుపతి రూరల్: ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు అందరూ ‘చలో మదనపల్లె మెడికల్ కాలేజీ’ ని విజయవంతం చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి గురువారం పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు మదనపల్లిలోని ఆరోగ్యవరం (శానిటోరియం) మెడికల్ కాలేజీ వద్దకు చేరుకోవాలన్నారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి విద్యార్థి విభాగం నేతలు ఉదయం 7 గంటలకు తుమ్మలగుంట నుంచి బయలుదేరనున్నట్టు తెలిపారు.
కూటమి కుట్రలను అడ్డుకుంటాం
నాయుడుపేట టౌన్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో కట్టిన 17 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కుయుక్తులను అడ్డుకుంటామని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తెలిపారు. గురువారం నాయుడుపేటలో చలో మెడికల్ కాలేజ్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తంబిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కలికి మాధవరెడ్డి, ఒట్టూరు కిషోర్ యాదవ్, ఓజిలి మండల కన్వీనర్ పాదర్తి హరినాథ్‌రెడ్డి, ఎంపీపీ ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాపాడుకుందాం

ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాపాడుకుందాం

ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాపాడుకుందాం