
సంతోషంగా ఉంది..
సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆక్వా రైతుల సమస్యలపై పార్లమెంటులో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి గళం విప్పి సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం సంతోషంగా ఉంది. ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర పభుత్వం సమాధానం ఇస్తూ.. సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తామని చెప్పడంతో పాటు ప్రత్యామ్నాయ చర్యలు చేపడతామని హామీ ఇవ్వడం హర్షదాయకం.
– కందలూరు మదన్‌మోహన్‌రెడ్డి,
ఆక్వా రైతు, చిల్లకూరు మండలం
బాధలను అర్థం చేసుకున్నారు..
గత కొంతకాలంగా తాము పడుతున్న ఆర్థిక ఇబ్బందు లు, అమెరికా సుంకాలతో చితికిపోతున్న సాగుదారు ల బాధలను అర్థం చేసుకు ని పార్లమెంటులో తిరుపతి ఎంపీ గురుమూర్తి చర్చించడం ఆనందంగా ఉంది. తిరుపతి జిల్లాలో అధికభాగం సాగులో ఉన్న టైగర్, వెనామీ రొయ్యల రైతులకు తిరుపతి ఎంపీ అడిగిన ప్రశ్నకు.. కేంద్ర మంత్రి ఇచ్చిన హామీ ఆర్థిక ఊరటనిస్తుంది. దీని వల్ల రొయ్యల రైతులు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. – మాచిరెడ్డి సుదీర్‌రెడ్డి,
ఆక్వా సాగుదారుడు, యాకసిరి, చిట్టమూరు

సంతోషంగా ఉంది..