
క్లోరినేషన్ చేయడమే మరిచారు
దొరవారిసత్రం : మండల పరిధిలోని కుగ్రామాలతో కలిపి 65 గ్రామాలకు ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ, పంచాయతీల నిర్వహణ పరిధిలో పీడబ్ల్యూఎస్, ఎంపీడబ్ల్యూఎస్ పథకాలు కలిపి 85 మంచి నీటి పథకాలు ఉన్నాయి. ఇందులో 25 ప్రాంతాల్లో ఓవర్ హెడ్ ట్యాంక్‌ల ద్వారా తాగునీరు సరఫరా అవుతుండగా.. కొన్ని గ్రామాలకు మంచి నీటి బావుల ద్వారా నేరుగా ఆయా ప్రాంతాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. అయితే ఒకటి రెండు గ్రామాల్లో తప్పా చాలాచోట్ల ట్యాంకుల శుభ్రం జరగడం లేదు. కొన్ని గ్రామాల్లో ఓవర్‌హెడ్ ట్యాంక్‌లకు నిచ్చెనలు లేకపోడంతో ఏళ్ల తరబడి శుభ్రం చేయడం లేదు.