ఎట్టకేలకు అడ్మిషన్లు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు అడ్మిషన్లు ప్రారంభం

Sep 19 2025 2:54 AM | Updated on Sep 19 2025 2:54 AM

ఎట్టక

ఎట్టకేలకు అడ్మిషన్లు ప్రారంభం

తిరుపతి సిటీ: ఉన్నత విద్యామండలి ఎట్టకేలకు డిగ్రీ అడ్మిషన్లకు శ్రీకారం చుట్టింది. దీంతో నాలుగు నెలల పాటు వేచిచూసిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. తిరుపతి టీటీడీ డిగ్రీ కళాశాలలో గురువారం సుమారు 600 మందికి పైగా అడ్మిషన్లు పొందారు. ప ద్మావతి డిగ్రీ కళాశాల, ఎస్‌జీఎస్‌, ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ సందర్భంగా వి ద్యార్థులు, తల్లిదండ్రులతో సందడి నెలకొంది. సీట్లు కేటాయించిన విద్యార్థులు ఈనెల 22 లోపు సంబంధిత కళాశాలల్లో రిపోర్టు చేయా లని కళాశాల యాజమాన్యాలు సూచించాయి.

టీటీడీకి రూ.10 లక్షల విరాళం

తిరుమల: విజయనగరానికి చెందిన కృష్ణ హరీష్‌ ఈశ్వర అనే భక్తుడు గురువారం టీటీడీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈమేరకు తిరుమలలోని టీటీడీ చైర్మన్‌ క్యాంపు కార్యాలయంలో చైర్మన్‌ బీఆర్‌ నాయుడుకు విరాళం డీడీని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌ రెడ్డి పాల్గొన్నారు.

ముగిసిన పీజీ అడ్మిషన్ల

తొలివిడత రిజిస్ట్రేషన్‌

తిరుపతి సిటీ: పీజీసెట్‌–2025 రిజిస్ట్రేషన్ల ప్రక్రియ బుధవారంతో ముగిసింది. ఉన్నత విద్యామండలి నిర్లక్ష్య వైఖరితో కనీసం రాష్ట్రవ్యాప్తంగా 32వేల సీట్లకు గాను కేవలం 11,400 మంది మాత్రమే పలు పీజీ కోర్సులకు దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో భాగంగా ఎస్వీయూ పరిధిలోని ప్రభుత్వ వర్సిటీలతో పాటు ప్రైవేటు పీజీ కళాశాలల్లో కనీసం 30శాతం సైతం రిజిస్ట్రేషన్లు కాకపోవడం విశేషం. దీంతో ఉన్నత విద్యామండలి సోమవారం నుంచి సీట్లు పొందిన విద్యార్థులకు ఆయా కళాశాలలో రిపోర్టు చేయాల్సి ఉంటుందని విద్యార్థులకు మెసేజ్‌లు పంపనుంది. మిగిలిన సీట్లకు వచ్చే వారంలో రెండో విడత అడ్మిషన్ల కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభించనున్నట్లు నాగార్జున వర్సిటీ పీజీసెట్‌–2025 కన్వీ నర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

గ్లోబల్‌ ఇన్నోవేషన్‌

క్యాపిటల్‌గా ఏపీ

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ క్యాపిటల్‌గా మారడానికి ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉందని డీఆర్‌డీఓ మాజీ చైర్మన్‌, ఏరోస్పేస్‌–డిఫెన్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌ గౌరవ సలహాదారు డాక్టర్‌ జి.సతీష్‌ రెడ్డి తెలిపారు. సీఐఐ ఏపీ ఆధ్వర్యంలో గురువారం తిరుపతిలో జరిగిన 2వ ఎడిషన్‌ ఇన్నోవేషన్‌ కార్యక్రమంలో ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. భారతదేశం ప్రపంచంలోనే తదుపరి ఆవిష్కరణ కేంద్రంగా రూపాంతరం చెందుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశా రు. పరిశోధన–ఆవిష్కరణలకు విషయాలను మార్చే శక్తి ఉందన్నారు. సీఐఐ ఏపీ మాజీ చైర్మన్‌, లెటర్‌ కాంప్లెగ్స్‌ సీఈఓ జేఎస్‌ఆర్‌కె ప్రసాద్‌, ప్రభుత్వ ఐటీ, ఎలక్ట్రానిక్స్‌–కమ్యూనికేషన్స్‌ విభాగం కార్యదర్శి భాస్కర్‌, ఐఐటీ తిరుపతి డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సత్యనారాయణ, సీఐఐ సదరన్‌ రీజియన్‌ మాజీ చైర్మన్‌, కావిన్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఎండీ రంగనాథన్‌, స్కైరూట్‌ ఏరోస్పేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సహ వ్యవస్థాపకుడు డైరెక్టర్‌ నాగభరత్‌, ఏవన్‌ నిపుణుడు సునీల్‌ డేవిడ్‌, కంపెనీల నిర్వాహకులు, ప్రతినిధులు ప్రసంగించారు.

ఎట్టకేలకు అడ్మిషన్లు ప్రారంభం 1
1/1

ఎట్టకేలకు అడ్మిషన్లు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement