
6 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
– 8లో
– 8లో
మంగళం అటవీ ప్రాంత పరిసరాల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు 6 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
గూడూరు: సొసైటీ ప్రాంతంలో శిథిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంకు
శిథిలావస్థలో ఓవర్ హెడ్ ట్యాంకులు
చిల్లకూరు : గూడూరు పట్టణంలో సుమారుగా 15 వేల కుటుంబాలకు పైగా నివాసం ఉండగా, సుమారు 80 వేల మంది వరకు జీవనం సాగిస్తున్నారు. పట్టణంలో 10 వరకు ఓవర్ హెడ్ ట్యాంకులు ఉండగా వాటిలో సుమారు 6 వరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్ని ఓవర్ హెడ్ ట్యాంకులను ఎప్పుడు శుభ్రం చేశారనే విష యం కూడా మున్సిపాలిటీలోని తాగునీటి విభా గం వారు కూడా చెప్పలేకపోతున్నారు. కొన్ని ట్యాంకులకు నిచ్చెనలు, మెట్లు లేవు. కండలేరు నీటిని వేములపాళెం వద్ద ఉన్న ఫిల్టర్ చేసి పంపింగ్ చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
వాకాడులో..
వాకాడు దళితవాడలో పైపులైన్లు లీకేజీ అవుతుండడంతో దాదాపు నెల రోజులుగా ప్రజలు మురుగునీటినే తాగాల్సిన దుస్థితి ఏర్పడింది. మండలంలో 53 ఓవర్ హెడ్ ట్యాంకులు ఉండగా 50 శాతం ట్యాంకుల్లో కూడా క్లోరినేషన్ చేపట్టకుండా తాగునీటిని సరఫరా చేస్తున్నారు.

6 ఎర్రచందనం దుంగలు స్వాధీనం