
సమాచార హక్కు చట్టంతో ప్రజాస్వామ్యం బలోపేతం
పాకాల : సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రమేశ్‌కుమార్ తెలిపారు. ఆయన శుక్రవారం కళాశాలలో విద్యార్థులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ వ్యవస్థల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. రాజనీతి శాస్త్రం అధ్యాపకులు ఆదిశేఖర్‌రెడ్డి సమాచార హక్కు చట్టం గురించి వివరించారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. జిల్లా స్థాయిలో వ్యాసరచన పోటీల్లో ద్వితీయ స్థానం సాధించిన ఎస్.కె.జాస్మిన్‌ను అభినందించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ మాశిలామణి, చిట్టికళావతి, కార్యక్రమ కన్వీనర్ ఈశ్వర్‌బాబు, రమణమ్మ, రేఖ పాల్గొన్నారు.