
క్షుద్ర పూజల కలకలం
సైదాపురం : మండలంలోని తోచాం గ్రామంలో గురువారం క్షుద్ర పూజలు కలకలం రేపాయి. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం గ్రామ పొలిమేరలో బుధవారం క్షుద్ర పూజలు చేసి పురాతన శ్రీకృష్ణుని ఆలయంలో తవ్వకాలు చేశారు. మండలంలోని తోచాం గ్రామ సమీపంలో పురాతనమైన శ్రీకృష్ణుని ఆలయం ఉంది. పురాతనమైన ఆలయం కావడంతో అక్కడ గుప్త నిధులుంటాయనే అనుమానంతో గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి ఆలయంలోకి ప్రవేశించి ప్రత్యేక పూజలు చేసి విగ్రహాలను ఆ ప్రాంతం నుంచి తొలగించి తవ్వకాలు జరిపారు. తోచాం పొలిమేరల్లో బుధవారం రాత్రి అమ్మవారి బొమ్మను వేసి పసుపు, కుంకమలతో క్షుద్ర పూజలు చేసిన ఆనవాలు లభ్యం అయ్యాయి. దీంతో గ్రామస్తులకు అనుమానం రావడంతో ఆలయాన్ని పరిశీలించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి విగ్రహాలను తొలగించారు. కొద్ది రోజుల నుంచి సమీప గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆలయ పరిసర ప్రాంతంతో పాటు గ్రామంలో సంచరిస్తుండటంతో అనుమానం కలిగి అతడిని పట్టుకుని విచారణ చేస్తుండగా వారి నుంచి తప్పించుకుని పారిపోయాడన్నారు. దీంతో గ్రామస్తులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్షుద్ర పూజలు జరగడంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు
భయాందోళన చెందుతున్న స్థానికులు

క్షుద్ర పూజల కలకలం