
జాతీయ స్థాయిలో ఎస్పీడబ్ల్యూ విద్యార్థుల ప్రతిభ
తిరుపతి సిటీ: చత్తీస్‌గడ్ రాష్ట్రం వసంత్ విహార్ బిలాస్‌పూర్‌లోని బత్రాయ్ ఇండోర్ స్టేడియం వేదికగా జూలై 26 నుంచి 29వ తేదీ వరకు జరిగిన జాతీయస్థాయి గ్రాప్లింగ్ (కుస్తీ) పోటీల్లో పద్మావతి మహిళా జూనియర్ కళాశాల విద్యార్థినులు బంగారు, వెండి, కాంస్య పతకాలను సాధించారు. జాతీయస్థాయిలో రాణించిన విద్యార్థినులను ప్రిన్సిపల్ డాక్టర్ సి.భువనేశ్వరి గురువారం అభినందించారు. ఇదే స్ఫూర్తితో కళాశాలలకు, టీటీడీ సంస్థకు మరింత పేరుప్రతిష్టలు తేవాలని విద్యార్థులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కోచ్ సాయి సమితిని ప్రత్యేకంగా అభినందించి ప్రశంసించారు. జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థుల్లో సౌమ్య బంగారు, కాంస్య పతకాలు సాఽధించగా, ఆర్.లావణ్య వెండి పతకం, ఆర్.దీపిక, శశిరేఖ, పూజశ్రీ, వైష్ణవి కాంస్య పతకాలు సాధించారు.