
జాతీయ స్థాయిలో తడుకు విద్యార్థుల ఘనత
తిరుపతి సిటీ : ఢిల్లీ వేదికగా జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనలో భాగంగా నిర్వహించిన వర్క్‌షాపులో తిరుపతి జిల్లా వడమాల పేట మండలం, తడుకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. గత మాసం 28 నుంచి 31వరకు నిర్వహించిన పోటీలో ఉత్తమ ప్రదర్శన కనబరిచి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభినందనలు పొందారు. ఈ సందర్భంగా ఏఐసీటీఈ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ విద్యార్థులకు ఇన్నోవేషన్ కోటాలో ఉత్తమ ప్రదర్శన అవార్డును అందజేశారు. దీంతో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఐఐటీ, నిట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇంజినీరింగ్ విద్యాసంస్థలలో ప్రత్యేక కోటా కింద సీట్లు కేటాయిస్తామని తెలిపారు. తడుకు చెందిన విద్యార్థులు హేమశ్రీ, గీతిక, హేమంత్ సోలార్ మిని పాస్ట్ కంపోస్టర్‌ను తయారు చేయడంపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. జిల్లా సైన్స్ అధికారి భాను ప్రసాద్‌ను ప్రత్యేకంగా అభినందించారు.