
మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు ఎన్‌బీఏ అక్రిడిటేషన్
తిరుపతి సిటీ: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న పద్మావతీ మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు 2028వ సంవత్సరం వరకు నేషనల్ బోర్డు అక్రిడిటేషన్ (ఎన్‌బీఏ) గుర్తింపు లభించింది. టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతూ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పద్మావతమ్మ, అధ్యాపకులు, సిబ్బంది సమష్టి కృషితో నేషనల్ బోర్డ్ అక్రిడిటేషన్ గుర్తింపు లభించిందన్నారు. గత నెలలో న్యూఢిల్లీ నుంచి విచ్చేసిన ఎన్‌బీఏ నిపుణుల బృందం కళాశాలలోని ప్రయోగశాలలు, అధ్యాపకులు, సిబ్బంది వివరాలు, రికార్డులు, మౌళిక సదుపాయాలను పరిశీలించారు. కళాశాలలో బోధన, ల్యాబ్స్, లైబ్రరీ తదితర అంశాలపై విద్యార్థుల నుంచి ఫీడ్‌బ్యాక్ సేకరించారు. నేషనల్ బోర్డ్ నిబంధనల మేరకు పాలిటెక్నిక్ కళాశాలను నిర్వహిస్తుండడంతో ఎన్‌బీఏ గుర్తింపు ఇచ్చారు.