
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
గూడూరురూరల్ : గూడూరు రూరల్ పరిధిలోని గాంధీనగర్ సమీపంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. రూరల్ ఎస్‌ఐ మనోజ్‌కుమార్ వివరాల మేరకు.. ఇందిరమ్మ కాలనీ 5వ వీధిలో ఓ మహిళ చనిపోయిందని స్థానికులు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించగా గూడూరు పట్టణంలోని నలజాలమ్మ వీధిలో నివాసం ఉంటున్న షేక్ సాహేరా భాను(33)తేలిందన్నారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవన్నారు. ఈ మేరకు గూడూరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి శవాన్ని తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఆటో బోల్తా పడి..
తిరుపతి రూరల్ : జాతీయ రహదారిపై ప్యాసింజర్ ఆటో బోల్తా పడడంతో డ్రైవర్ మృతి చెందగా పలువురు ప్రయాణికులు గాయపడిన ఘటన బుధవారం వెలుగు చూసింది. పోలీసుల సమాచారం మేరకు.. తిరుపతి రూరల్ గాంధీపురం పంచాయతీ పరిధిలోని బాలాజీ డెయిరీ సమీపంలో పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై చంద్రగిరి నుంచి తిరుపతి వైపునకు వెళ్లే ప్యాసింజర్ ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో పాతకాల్వకు చెందిన డ్రైవర్ కనికాచలం (50) అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే గాజులమండ్యంకు చెందిన రామయ్యకు తీవ్ర గాయాలు కాగా, ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి స్వల్ప గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. ఆటో డ్రైవర్ అజాగ్రత్త వల్లే బోల్తా పడినట్లు పోలీసులు గుర్తించారు. తిరుపతి రూరల్ సీఐ చిన్నగోవిందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి