
స్కిట్ పూర్వవైభవానికి సహకరిస్తాం
శ్రీకాళహస్తి: స్కిట్ కళాశాలతో తనకు ఎంతో అనుబంధం ఉందని 2010–11 ప్రాంతంలో మిస్‌మేనేజ్‌మెంట్, పాలిటిక్స్‌తో కళాశాల విహీనంగా మారిందని జేఎన్‌టీయూ వైస్‌చాన్స్‌లర్ సుదర్శన్‌రావు అన్నారు. కళాశాల మూతపడడం చాలా బాధ కలిగించిందన్నారు. స్కిట్ కళాశాల పూర్వవైభవానికి పూర్తిగా సహకారం అందిస్తామన్నారు. మొదటి కౌన్సెలింగ్‌లో అనుమతి వచ్చి ఉంటే బాగుండేదని, రెండవ కౌన్సెలింగ్‌లో రావడం సంతోషకరమన్నారు. ఇందుకు విద్యాశాఖమంత్రి మంత్రి నారా లోకేష్, ఓఎస్డీలు ప్రసాద్, రమణ, కార్యదర్శి శశిధర్ పునఃప్రారంభానికి కృషి చేశారన్నారు. రెండు నెలల్లో దీనిపై అనేకసార్లు నివేదికలు ప్రభుత్వానికి పంపించి ఎట్టకేలకు తేగలిగామని తెలిపారు. రెండు మూడేళ్లలో స్కిట్ ఉత్తమమైన ఫలితాలు సాధించే విధంగా పూర్తి సహకారం అందిస్తామన్నారు. సెమీ కండక్టర్ పరిశ్రమలు ఇండియాలోకి వస్తున్నాయని ఈ స్కిట్‌లో వచ్చే విధంగా చూస్తామన్నారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.