
భావి ఇంజినీర్లుగా ఎదగాలి
ఏర్పేడు : తిరుపతి ఐఐటీలో నూతనంగా బీటెక్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు బాగా చదువుకుని భావి ఇంజనీర్లుగా ఎదగాలని ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ ఆకాంక్షించారు. సోమవారం ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో యువంతర్– 2025 ఓరియంటేషన్ నిర్వహించారు. డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ ఏడాది మొత్తం 254 మంది విద్యార్థులు బీటెక్ ప్రవేశం పొందినట్లు వెల్లడించారు. విద్యా వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ రామకష్ణ గోర్తి , విద్యార్థి వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ ఎన్ ఎన్ మూర్తి ప్రసంగించారు.