
పీజీఆర్‌ఎస్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వండి
● గ్రీవెన్స్‌కు 260 అర్జీలు ● రెవెన్యూ సమస్యలపై 125 అర్జీలు
తిరుపతి అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)కు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌కు 260 అర్జీలు వచ్చాయి. అందులో రెవెన్యూ సమస్యలపై 125 అర్జీలను వచ్చాయి. కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్షి, డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోస్మాండ్, దేవేంద్రరెడ్డి, శివశంకర్‌నాయక్, సుధారాణి, పలువురు జిల్లా అధికారులు గ్రీవెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలని ఆదేశించారు. గ్రీవెన్స్‌కు ప్రతి విభాగానికి చెందిన జిల్లా అధికారి హాజరుకావాలని ఆదేశించారు. హజరైన అధికారి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉండాలని చెప్పారు. మరోవైపు గ్రీవెన్స్‌కు వచ్చిన అర్జీదారులకు అవసరం అయిన మేరకు కుర్చీలను ఏర్పాటు చేయాలని, టీ, కాఫీ అందించాలని, తాగునీటి వసతులు కల్పించాలని వైద్యా ఆరోగ్యశాఖ వారు వైద్యశిబిరాన్ని నిర్వహించాలని ఆదేశించారు.
మాకు న్యాయం చేయండి !
నా పేరు మంకు మునెమ్మ, మాది శ్రీకాళహస్తి మండలం రాచగున్నేరి గ్రామం. మా గ్రామంలోనే సర్వే నంబర్ 283లో 1.93 ఎకరాల భూమి దశాబ్దాలుగా నా ఆధీనంలో ఉంది. 1994లో కరెంట్ సర్వీస్ తీసుకున్నాను. ప్రభుత్వం ఉచితంగా బోరు కూడా వేసింది. అయితే మా గ్రామానికి చెందిన అధికారపార్టీ నాయకుడు అదే ప్రాంతంలో 20 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఆక్రమించి సాగు చేసుకుంటున్నారు. దాంతోపాటు 1.93 ఎకరాల నా భూమిని ఆక్రమించుకోవడానికి కుట్రలు చేస్తున్నారు. ఈ విషయాన్ని మా మండల రెవెన్యూ అధికారులకు తెలియజేసినప్పటికి వారు అధికారపా ర్టీకి చెందిన నేతకే మద్దతు తెలుపుతున్నారు. మా భూమి ఆక్రమణకు గురి కాకుండా కాపాడి, మా న్యాయం చేయండి. – మంకు మునెమ్మ,
రాచగున్నేరి, శ్రీకాళహస్తి మండలం
రెవెన్యూ అధికారులు అమ్ముడుపోయారు!
నా పేరు విజయమ్మ, మాది వాక్యం గ్రామం, బాలాయపల్లి మండలం. 8.80 ఎకరాల మా భూమిని అధికారపార్టీకి చెందిన నేతలు ఆక్రమించారు. ఈ విషయంపై మా మండల రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకుంటే వారు పట్టించుకోవడం లేదు. మరోవైపు నేతలకు మా మండలంలోని పలువురు రెవెన్యూ అధికారులు అమ్ముడుపోయారు. గట్టిగా ప్రశ్నిస్తే మాపై దౌర్జన్యం చేస్తున్నారు. మాకు న్యాయం చేయండి సారూ అంటూ పలువురు మహిళలు సోమవారం గ్రీవెన్స్‌లో ఆవేదన చెందారు.
– విజయమ్మ, ఆమె కుటుంబ సభ్యులు