
స్కిట్ కళాశాలలో అడ్మిషన్లు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయ అనుబంధంగా ఉన్న స్కిట్ కళాశాలను మూడు సంవత్సరాల కిందట ఆలయ ఆర్థిక భారంతో మూత వేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు స్కిట్ కళాశాల జేఎన్‌టీయూ, స్కిట్ అనుసంధానంతో సెల్ఫ్ ఫైనాన్స్ పద్ధతిలో ఇంజినీరింగ్‌కు సంబంధించిన విద్యార్థుల ప్రవేశానికి ఆన్‌లైన్‌లో అనుమతించారు. ఇందులో మొదటి సంవత్సరం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, సీఎస్సీ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ అండ్ మెషన్ లెర్నింగ్, సీఎస్‌టీ(డేటా సైన్స్), ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ సంబంధించి 66 సీట్లు చొప్పున మొత్తం 330 సీట్లు అలాట్ చేసినట్లు ప్రకటించారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఒకో పోస్టుకు రూ.70 వేలుగా ఫీజు నిర్ణయించారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, మంత్రి నారా లోకేష్ సహకారంతో కళాశాల ప్రారంభం చేసినట్లు ప్రకటించారు. దీనిపై స్కిట్ కళాశాల వద్ద మంగళవారం సంబరాలు చేసుకోనున్నట్లు తెలిసింది. అయితే కోర్టు కేసులు, నాన్‌టీచింగ్, టీచింగ్‌కు సంబంధించి 90 మంది గతంలో పనిచేవారుండగా వారిలో కొంతమంది కోర్టు స్టే తెచ్చుకోనున్నారు. అలాగే నాన్ టీచింగ్ కింద 36 మంది, 24 మంది కాంట్రాక్టు పద్ధితిలో పనిచేశారు. వారి పరిస్థితి ఏమిటన్నది వెల్లడి కావాల్సి ఉంది. జేఎన్‌టీయూ ఏ ప్రాతిపదికన స్కిట్ కళాశాలతో అనుసంధానం అయిందో అనే విషయంపై త్వరలోనే వెల్లడి కావల్సి ఉంది.
గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
చంద్రగిరి:గుర్తు తెలియని వ్యక్తి ఉరివేసుకుని మృతి చెందిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని శ్రీనివాసమంగాపురం రైల్వేగేటు సమీపంలోని అటవీ ప్రాంతంలో సుమారు 40 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ అనిత తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని, 20 అడుగుల ఎత్తులో చెట్టుపైన వ్యక్తి మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడు ఉరివేసుకుని సుమారు 10 రోజులకుపైగా కావడంతో గుర్తు పట్టలేనంతగా ఉందని తెలిపారు. ఘటన స్థలంలో మద్యం బాటిళ్లను పోలీసులు గుర్తించారు. మృతుడి ఆచూకీ లభ్యం కాకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తిగా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆత్మహత్యకు పాల్పడ్డాడా, లేక హత్యచేసి చెట్టుకు వేలాదీశారా..? అన్న కోణంలో విచారిస్తున్నట్లు ఎస్‌ఐ అని తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో భక్తుడి మృతి
నారాయణవనం: మండలంలోని జాతీయ రహదారిలో సొమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుమలకు కాలినడకన వెళుతున్న గోవిందమాల భక్తుడు బాలసుబ్రమణ్యన్(51)మృతి చెందా డు. తోటి భక్తుల కథనం మేరకు.. చైన్నె సమీపంలోని అంబత్తూరులో ప్రభుత్వ మద్యం దుకాణంలో బాలసుబ్రమణ్యన్ సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు. స్నేహితుల తో కలిసి ఈనెల 26వ తేదీన శనివారం గోవిందమాల ధరించి కాలినడకన తిరుమలకు బయలుదేరాడు. సోమవారం సాయంత్రం మండలంలోని జాతీయ రహదారి బైపాస్‌లోని మండల కాంప్లెక్స్ సమీపానికి చేరుకున్నారు. అదే సమయంలో పుత్తూరు వైపు వస్తున్న వాహనం వేగంగా బాలసుబ్రమణ్యన్‌ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన బాలసుబ్రమణ్యన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ లోకనాథం తెలిపారు.