
పారదర్శకంగా ఉపాధి పనుల తనిఖీ
చంద్రగిరి: ఉపాధి హామీ పథకంలో జరిగిన ప నుల తనిఖీలను పారదర్శకంగా నిర్వహించాలని ఎన్‌ఆర్‌ఈజీఎస్ పీడీ రెడ్డెప్ప సూచించారు. సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ హేమేంద్ర కుమార్ రెడ్డి అధ్యక్షతన 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద చేపట్టిన పనుల సోషల్ ఆడిట్‌పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 ఏప్రిల్1 నుంచి 2025 మార్చి 31వ తేదీ వరకు రూ.21.64 కోట్ల మేరకు ఉపాధి పనుల ద్వారా పనులు జరిగినట్లు తెలిపారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి సోషల్ ఆడిట్ నిర్వహించడం జరుగుతుందన్నారు. మంగళవారం నుంచి మండలవ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో జరిగిన పనులపై సిబ్బంది గ్రామస్తులు, ఉపాధి కూలీల సమక్షంలో తనిఖీలను చేపట్టడం జరుగుతుందన్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను సిబ్బంది పారదర్శకంగా తనిఖీ చేపట్టాలని ఆయన కోరారు. ఉపాధి హామీ పథకం కింద పంచాయతీ రాజ్, ఇంజినీరింగ్, నీటి సరఫరా, హౌసింగ్, అటవీశాఖ, పశు సంవర్థక శాఖ, సర్వశిక్షా అభియాన్, సామాజిక పెన్షన్లపై తనిఖీలను చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పథకం తనిఖీల్లో రాజీ పడకుండా చేయాలని, అవినీతికి పాల్పడిన వారిని గుర్తించి నివేదిక సమర్పించాలన్నారు. అనంతరం రామిరెడ్డిపల్లి, అగరాలలో జరిగిన అవకతవకలపై సర్పంచ్‌లు కొటాల చంద్రశేఖర్ రెడ్డి, అగరాల భాస్కర్ రెడ్డి అధికారులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటరత్నం, ఎస్‌ఆర్పీ వెంకయ్య, ఏపీఓ భార్గవి, పీఆర్ ఏఈ రాజాజీ తదితరులు పాల్గొన్నారు.
బావిలో మృతదేహం
నాగలాపురం: మండలంలోని కృష్ణాపురంలో రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ బావిలో మృతదేహం లభ్యమైనట్లు ఎస్‌ఐ సునీల్ తెలిపారు. పోలీసులు కథనం మేరకు.. కృష్ణాపురం గ్రామానికి చెందిన తిప్పారెడ్డి, వెంకటేశ్వరరావు పొలంలో బావి ఉంది. ఆ బావిలో మృతదేహం ఉండగా గ్రామస్తులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చే రుకుని మృతదేహాన్ని వెలికితీశారు. ఆ మృతదే హం సుమారు 40–45 ఏళ్లు ఉంటుంది. మృతు డు నీటిలో పడి సుమారు నాలుగు రోజులు అయి ఉండచ్చని, అలాగే మృతుడు తెలుపు రంగు చొ క్కా ధరించి ఉన్నాడని, చొక్కా మీద జీవీ సెన్ అ నే స్టిక్కర్ ఉందని ఎస్‌ఐ తెలిపారు. కాగా ఈ విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహం తన కుమారుడు గజేంద్రుడిదిగా గుర్తించారు. మృతుడికి మద్యం అలవాటు ఉన్న కారణంగా మద్యం మత్తులో బావిలో పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

పారదర్శకంగా ఉపాధి పనుల తనిఖీ