
అమానుష ఘటనపై ఆగ్రహం
కోట : స్థానిక జెడ్పీ హైస్కూల్‌లో విద్యార్థినులతో గుంజిళ్లు తీయించిన అమానుష ఘటనపై ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన పాఠశాలకు సందర్శనకు విచ్చేశారు. విద్యార్థినులతో మాట్లాడేందుకు యత్నించగా పోలీసులు పాఠశాలలోకి అనుమతించలేదు. దీంతో ఉపాధ్యాయులను బడి బయటకు పిలిపించి ఘటనపై ఆరా తీశారు. హెచ్‌ఎం భారతి మాట్లాడుతూ ఎస్సీ హాస్టల్ విద్యార్థినులతో గుంజిళ్లు తీయించిన పీడీ సుభాన్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు తెలిపారు. బాలికలు గుంజిళ్లు తీస్తుంటే ఉపాధ్యాయులు ఎందుకు అడ్డుకోలేదని ఎమ్మెల్సీ ప్రశ్నించారు. పీడీ వ్యవహారంపై కమిటీ వేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. నేరం రుజువైతే నిందితుడిని సర్వీస్ నుంచి డిస్మిస్ చే యాలని కోరారు. పిల్లలతో మాట్లాడి వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు వస్తే పోలీసులు అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు. ఎస్‌ఐ పవన్‌కుమార్ మాట్లాడుతూ పీడీపై ఇప్పటికే కేసు నమోదు చేసినటు వెల్లడించారు.
అనంతరం ఎస్సీ బాలికల హాస్టల్‌ను ఎమ్మెల్సీ మేరిగ సందర్శించారు.వార్డెన్ ఉషారాణితో మాట్లాడారు. పిల్లలకు తగిన భద్రత కల్పించాలన్నారు. వైఎస్సార్‌సీపీ విద్యార్ధి సంఘం జిల్లా అధ్యక్షుడు అశ్విత్‌రెడ్డి, మండల కన్వీనర్ పలగాటి సంపత్‌కుమార్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, షనీల్‌రెడ్డి, ప్రసాద్‌గౌడ్, సుధారెడ్డి, పి.సురేంద్ర, శశిరెడ్డి, సాయిరెడ్డి, కోటారెడ్డి, నాగూర్‌యాదవ్ పాల్గొన్నారు.