
నిమ్మ..కన్నీటి చెమ్మ!
● ఆక్రమణల పేరుతో నిమ్మ చెట్ల తొలగింపు ● లబోదిబోమంటున్న గిరిజనులు ● అధికారుల తీరుపై దుమ్మెత్తి పోస్తున్న ప్రజలు
సైదాపురం మండలం, గద్దలతిప్ప వద్ద సర్వే నం.793లో నలుగురు పేదలు సాగు చేసుకుంటున్న సుమారు 500 నిమ్మ చెట్లను అధికారులు తొలగించేశారు. దీనిపై జిల్లా వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలు సంఘాల నాయకులు అధికారుల తీరును ఎండగడుతున్నారు. 30 ఏళ్లుగా సాగుచేసుకుంటున్నా పట్టించుకోని అధికారులు.. ఇప్పుడు కూటమి నేతలకు కట్టబెట్టేలా చర్యలు చేపడుతున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆక్రమణ పేరుతో నిమ్మ చెట్లు తొలగించేశారని మండిపడుతున్నారు. ఈ దౌర్జన్యం ఇంకా ఎంతకాలం..? అంటూ నిలదీస్తున్నారు. – సైదాపురం

నిమ్మ..కన్నీటి చెమ్మ!

నిమ్మ..కన్నీటి చెమ్మ!