
ఫుట్‌బాల్ విజేతగా అనంతపురం జట్టు
నాయుడుపేటటౌన్ : అంతర్ జిల్లా స్థాయిలో నాయుడుపేట పట్టణంలోని ఏఎల్‌సీఎం గ్రౌండ్‌లో అండర్–15 జానియర్ బాలికల విభాగంలో ఆదివారం జరిగిన ఫుట్‌బాల్ ఫైనల్స్ పోటీలో అనంతపురం జిల్లా జట్టు విజేతగా నిలిచింది. నాయుడుపేట పుట్‌బాల్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా ఫుట్‌బాల్ కమిటీ ఆధ్వర్యంలో అండర్–15 బాలికల విభాగంలో అంతర్ జిల్లా స్థాయిలో పోటీలను నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించి 9 జోన్ల పరిధిలోని 15కు పైగా జట్లు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం సాయంత్రం వరకు పోటీలు జరగగా ఫైనల్ పోటీలో అనంతపురం, వైఎస్సార్ కడప జట్లు హోరా హోరీగా తలపడ్డాయి. విన్నర్స్‌గా అనంతపురం, రన్నర్స్‌గా వైఎస్సార్ కడప జిల్లా జట్లు నిలిచినట్లు తెలిపారు, పొట్టి శ్రీరాములు నెల్లూరు జట్టు మూడో స్థానంలో నిలిచింది. ట్రోఫీల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథాగా నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ పాల్గొని క్రీడాకారులను అభినందించారు. బాలికలు విద్యతో పాటు క్రీడల్లో మేటిగా రాణిం చాలని సూచించారు. పుట్‌బాల్ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న జాతీయస్థాయి క్రీడాకారులు, కోచ్ గౌస్‌బాషతో పాటు నాయుడుపేట ఫుట్‌బాల్ క్లబ్ సభ్యులు ఎంతో కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం విజేతలుగా నిలిచిన విన్నర్స్, రన్నర్స్‌తో పాటు మూడో స్థానంలో నిలిచిన జట్లుకు ట్రోఫీలను అందించారు. రాష్ట్ర స్థాయిలో జరిగే పుట్‌బాల్ పోటీలకు జిల్లా జట్టును సైతం ఎంపిక చేసినట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో ఫుట్ బాల్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ రెడ్డిప్ప, చర్చి పీసీసీ చైర్మన్ కారల్ మధు, బీజే ప్రసాద్, కళాచంద్, ఆనంద్, ఎన్‌ఎఫ్‌సీకు చెందిన కాళహస్తి భావిన్ అనుదీప్, టైసన్, రాఖీ, ఏలిష, సిరాజ్, భాను విజయ్ పాల్గొన్నారు.