
రైలులో నుంచి జారిపడి కానిస్టేబుల్ మృతి
వెంకటగిరి రూరల్ : రైలులో నుంచి జారి పడి కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన వెంకటగిరి రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు డక్కిలి మండలం సంగనపల్లి గ్రామానికి చెందిన సద్దికూటి అశోక్ (33) వెంకటగిరి పట్టణంలోని పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. వెంకటగిరిలో విధులకు హాజరయ్యేందుకు గూడూరు– వెంకటగిరి మార్గంలోని రైల్లో వస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు రైల్వేపోలీసులు తెలియజేశారు.
అశోక్ మృతదేహానికి డీఎస్పీ నివాళి
వెంకటగిరి పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ అశోక్ అంత్యక్రియల్లో గూడూరు డీఎస్పీ గీతా కుమారి, సీఐ ఏవీ రమణ, ఎస్సైలు, పోలీసులు పాల్గొని అశోక్ మృతదేహానికి నివాళి అర్పించారు.