
రేపటి నుంచి రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
తిరుపతి కల్చరల్ : చిత్తూరు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్, శాప్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పి.రామకృష్ణయ్య తెలిపారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ పోటీలకు దేశవ్యాప్తంగా 400 మంది క్రీడాకారులు హాజరు కానున్నారని తెలిపారు. సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సుధాకర్‌రావు, కోశాధికారి జి.శివయ్య, మునస్వామి పాల్గొన్నారు.
రేపటి నుంచి
రెండవ విడత వెబ్ ఆప్షన్లు
తిరుపతి సిటీ : ఇంజినీరింగ్ తొలి విడత తొలి విడతలో ఎస్వీయూ పరిధిలో 14,352 మంది విద్యార్థులు సీట్లు సాధించి తమకు కేటాయించిన కళాశాలలో ప్రవేశాలు పొందారు. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో భాగంగా రెండవ విడత సీట్ల కేటాయింపు కోసం వెబ్ ఆప్షన్ల ప్రక్రియ సోమవారం నుంచి కొనసాగనుంది. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రక్రియపై సందేహాలకు ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని ఏపీఈఏమ్‌సెట్–2025 కౌన్సెలింగ్ సెంటర్ నందు సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.