
పీ4పై సమీక్షల పర్వం
తిరుపతి అర్బన్ : అట్టడుగుస్థాయిలో ఉన్న 20 శాతం మంది పేదలను దత్తత తీసుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పీ4 ప్రాజెక్టుపై ప్రతి రోజు సమీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లా స్థాయిలో మూడు రోజులుగా కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్షిస్తున్నారు. ఓ వైపు అధికారులతో మరోవైపు పారిశ్రామిక వేత్తలతో ఇంకో వైపు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. తాజాగా శుక్రవారం ఇదే అంశంపై సీఎం చంద్రబాబు జిల్లా అధికారులతో అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి కలెక్టర్ వెంకటేశ్వర్‌తో పాటు డీఆర్వో నరసింహులు, ప్రణాళికశాఖ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు.
ఆగస్ట్ 5లోపు పీ4 మ్యాపింగ్
తిరుపతి అర్బన్: జిల్లాలో గ్రామాల వారీగా పీ4 సర్వే మ్యాపింగ్‌ను ఆగస్ట్ 5 లోపు పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. ఆయన శుక్రవారం రాత్రి అధికారులతో పీ4పై సమీక్షించారు. ఆయన మాట్లాడు బంగారు కుటుంబాలను గుర్తించి వారి కనీస అవసరాలకు తగ్గట్లుగా మార్గదర్శకులను మ్యాపింగ్ చేయాలన్నారు. నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లు తమ లాగిన్‌లో అర్హులైన బంగారు కుటుంబాల వారిని నమోదు చేసి అనర్హులను డిలీట్ చేయాలన్నారు. ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు పీ4 ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలన్నారు. జిల్లా, మండల స్థాయిలో ప్రతి సమాచారాన్ని అధికారులు తమ లాగిన్‌లో అప్‌లోడ్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని తెలిపారు.

పీ4పై సమీక్షల పర్వం