
అంధ క్రీడాకారుడికి కలెక్టర్ అభినందన
తిరుపతి అర్బన్ : బ్‌లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఏపీ తరపున గోల్‌బాల్ భారత్ జట్టుకు ఎంపికై న ముప్పాళ్ల శేషగిరిని కలెక్టర్ వెంకటేశ్వర్ అభినందించారు. గురువారం కలెక్టరేట్‌లో బ్‌లైండ్ స్పోర్ట్స్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి పెంచల నరసయ్య ఆధ్వర్యంలో ముప్పాళ్ల శేషగిరి కలెక్టర్‌ను కలిశారు. ఈ క్రమంలో కలెక్టర్ వారిని అభినందించి మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
శ్రీవారి దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: తిరుమల శ్రీవారిని గురువారం ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డివిజి శంకర్‌రావు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించగా.. టీటీడీ అధికారు లు లడ్డూ ప్రసాదాలతో ఘనంగా సత్కరించారు.

అంధ క్రీడాకారుడికి కలెక్టర్ అభినందన