
చంద్రగిరి కోటలో అసెంబ్లీ స్పీకర్
చంద్రగిరి: మండలకేంద్రంలోని రాయలవారి కో టను రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు బుధవారం సందర్శించారు. సెప్టెంబర్ 14, 15 తేదీల్లో తిరుపతి నగరంలో జరగనున్న జాతీయస్థాయి మహిళా సాధికారత కమిటీ సమావేశాలకు దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీ మహిళా సాధికారత కమిటీ సభ్యులు, పార్లమెంటు మహిళా సాధికారత కమిటీ సభ్యులు, పార్లమెంట్ స్పీకర్, రాష్ట్రగవర్నర్, ముఖ్యమంత్రి ఇత ర ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో చారిత్రాత్మక కట్టడమైన చంద్రగిరి కోటను మహి ళా సాధికారత కమిటీ సభ్యులు సందర్శించునున్నారు. ఈ సమావేశాల ఏర్పాట్లపై తిరుపతికి వి చ్చేసిన రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డితో కలిసి చంద్రగిరి కోటను సందర్శించారు. చంద్రగిరి కోట ప్రాశస్త్యాన్ని, విశేషాలను తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్‌కు వివరించారు. చంద్రగిరి కోటను సందర్శించే మహిళా సాధికారత కమిటీ సభ్యులకు చంద్రగిరి కోటలో మ్యూజికల్ లైట్స్ షోను ఏర్పాటు చేస్తామని, అలాగే ఆ రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వారికి పసందైన విందును ఏర్పాటు చేస్తామని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు. దేశం నలుమూలల నుంచి వచ్చే అతిథుల కోసం ఏర్పాటు చేసే ఆంధ్ర ఆతిథ్యం అదిరిపోవాలని స్పీకర్ సూచించారు. చంద్రగిరి కోట ఆవరణలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడిని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఘనంగా సత్కరించారు.