
ప్రజాభిమానాన్ని ఆపలేరు
వరదయ్యపాళెం: అక్రమ అరెస్టులతో ప్రజాభిమానాన్ని ఆపలేరని వైఎస్సార్‌సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ అన్నారు. బుధవారం వరదయ్యపాళెం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఉన్న వైఎస్సార్ విగ్రహం వద్ద ఆయన పార్టీ శ్రేణులతో కలసి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ అసలు మద్యం స్కాం ఎక్కడ జరిగిందని, ఎంపీ మిథున్‌రెడ్డిని ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్సార్‌సీపీ కార్యదర్శి బీరేంద్ర వర్మ, మండల పార్టీ అధ్యక్షుడు నాయుడు దయాకర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చిన్నా, చేనేత విభాగ రాష్ట్ర కార్యదర్శి బొప్పన తిలక్‌బాబు, రాష్ట్ర యువజన కార్యదర్శి శిబి చక్రవర్తి, రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి అబ్దుల్, జిల్లా సోషల్ మీడియా కార్యదర్శి శోభన్ యాదవ్, సీనియర్ నాయకులు దామోదర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, భానుప్రకాష్ రెడ్డి, నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు బందిల సురేష్ (బూత్ కమిటీ), వినోద్ యాదవ్ (యువజన), దుడ్డు వేణు (ఎస్సీ సెల్), దేవళ్ల మహేంద్ర (బీసీ సెల్), శివా యాదవ్ (ప్రచార కమిటీ), గిరిరెడ్డి (గ్రీవెన్స్ సెల్), మాజీ సర్పంచ్ కవిత తదితరులు పాల్గొన్నారు.
సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్
రాజకీయ కక్షతోనే మిథున్ రెడ్డి అరెస్టు
సత్యవేడు: రాజకీయ కక్షతోనే రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని అర్ధరాత్రి అరెస్టు చేశారని వైఎస్సార్ సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ అన్నారు. బుధవారం సత్యవేడులో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం సమీపంలో నిరసన తెలిపి, నేతాజీ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నూకతోటి రాజేష్ మాట్లాడుతూ లేని మద్యం కేసు సృష్టించి.. జగన్‌మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నారన్న అక్కసుతో మిథున్ రెడ్డిని ఆ కేసులో ఇరికించారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి బీరేంద్రవర్మ, మండల కన్వీనర్ కే. సుశీల్‌కుమార్ రెడ్డి, పార్టీనాయకులు భానుప్రకాష్ రెడ్డి, కేవి. నిరంజన్‌రెడ్డి, ఏవీఎం బాలాజీ రెడ్డి, సర్పంచ్ పి. మంజుల, రమేష్, మస్తానీ, బి. సోమశేఖర్, సెంథిల్, పునిదకుమార్, కృష్ణయ్య, ఎంపీ రవి, వీడీ శరవనన్, పళణి, దయాళన్, శ్రీధర్ రెడ్డి, ఇస్మాయిల్, జోషఫ్, సోము, రాబిన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.