
● నెలరోజులకే...చిరిగిపోయిన స్కూల్ బ్యాగులు ● సొంత బ్య
తిరుపతి సిటీ: ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు నాణ్యమైన బ్యాగులు ఇచ్చామంటూ ప్రగల్భాలు పలుకుతున్న కూటమి సర్కార్ డొల్లతనం బయటపడింది. విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేసి కనీసం పట్టుమని నెలరోజులు కాకముందే బ్యాగులు చిరిగిపోయి మూలన పడేసి, సొంత బ్యాగులు కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. మరికొందరి బ్యాగులకు కుట్లు ఊడిపోవడం, జిప్‌లు పోవడంతో గుండుపిన్నులు వేసుకుని పాఠశాలకు వెళుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏదో చేసేస్తున్నామంటూ కూటమి ప్రభుత్వం మాయమాటలు చెబుతూ ఇంత అధ్వాన్నంగా నాసిరకం బ్యాగులను సరఫరా చేయడం దారుణమని తల్లిదండ్రులు వాపోతున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలలో ఇదే పరిస్థితి నెలకొంది. నెలరోజులకే సుమారు 40 శాతం మంది విద్యార్థులు తమ సొంత బ్యాగులను పాఠశాలకు తీసుకువెళ్లుతున్నారు.

● నెలరోజులకే...చిరిగిపోయిన స్కూల్ బ్యాగులు ● సొంత బ్య

● నెలరోజులకే...చిరిగిపోయిన స్కూల్ బ్యాగులు ● సొంత బ్య