పాలిటెక్నిక్‌ కోర్సుల్లో తగ్గుతున్న అడ్మిషన్లు | - | Sakshi
Sakshi News home page

పాలిటెక్నిక్‌ కోర్సుల్లో తగ్గుతున్న అడ్మిషన్లు

Jul 23 2025 6:00 AM | Updated on Jul 23 2025 6:00 AM

పాలిట

పాలిటెక్నిక్‌ కోర్సుల్లో తగ్గుతున్న అడ్మిషన్లు

స్నాతకోత్సవం నిర్వహించండి
ఎస్వీయూ స్నాతకోత్సవం నిర్వహించాలని జీఎన్‌ఎస్‌ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు శివశంకర్‌ నాయక్‌ కోరారు.
పాలిటెక్నిక్‌.. ఇది సాంకేతిక విద్య.. విద్యార్థి ఉపాధికి చక్కని మార్గం.. అయినా ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం.. మౌలిక వసతులు, ల్యాబ్‌లు, అవగాహన లేమి.. అధ్యాపకుల కొరత.. ప్రోత్సాహం కరువు తదితర కారణాలతో విద్యార్థులు ఆ కోర్సులో ప్రవేశానికి మొగ్గు చూపడం లేదు. ఫలితంగా పలు కళాశాలల్లో సీట్లు భర్తీకి నోచుకోక మిగిలిపోతున్నాయి. దీంతో కాలేజీల భవిత ప్రశ్నార్థకంగా మారుతోంది.
● పలు కళాశాలల్లో ప్రవేశాలు సింగిల్‌ డిజిట్‌కే పరిమితం ● అయోమయంలో పలు కళాశాలల భవితవ్యం

బుధవారం శ్రీ 23 శ్రీ జూలై శ్రీ 2025

8లో

వంద శాతం ప్లేస్‌మెంట్‌ అవకాశాలు

తిరుపతి ఎస్వీ పాలిటెక్నిక్‌ కళాశాలలో అన్ని బ్రాంచ్‌ల్లో పూర్థిస్థాయిలో సీట్లు భర్తీ అయ్యాయి. లేటరల్‌ ఎంట్రీ సీట్లు మాత్రమే కొంత మేర మిగిలియాయి. ఇతర కళాశాలల బదిలీపై వచ్చే విద్యార్థులతో ఆ సీట్లు సైతం పూర్తి స్థాయిలో భర్తీ కానున్నాయి. కళాశాలలో పాలిటెక్నిక్‌ పూర్తి చేసిన ప్రతి విద్యార్థికీ క్యాంపస్‌డ్రైవ్‌లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. గత ఏడాది అన్ని బ్రాంచ్‌ల్లోని విద్యార్థులు వంద శాతం ప్లేస్‌మెంట్స్‌ సాధించారు. దీంతో పలు ప్రాంతాల నుంచి విద్యార్థులు కళాశాలలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు.

– వై.ద్వారకనాథరెడ్డి, ప్రిన్సిపల్‌, ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, తిరుపతి

తిరుపతి సిటీ: అతి పిన్నవయస్సులో ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పొందే వృత్తి విద్యగా పేరుగాంచిన పాలిటెక్నిక్‌ కోర్సులకు ఆదరణ క్రమేపీ తగ్గుముఖం పడుతోంది. పాలిటెక్నిక్‌ డిప్లొమో కోర్సుల్లో ప్రవేశాల కోసం చేపట్టిన ఏపీ పాలిసెట్‌–2025 కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని 6 ప్రభుత్వ కళాశాలలో అంతంత మాత్రంగానే అడ్మిషన్లు జరిగాయి. గూడూరు, సత్యవేడు కళాశాలలో 90 శాతం సీట్లు ఖాళీగా ఉండడం విశేషం. కేవలం తిరుపతి ఎస్వీ పాలిటెక్నిక్‌, టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న పద్మావతి పాలిటెక్నిక్‌ కళాశాలలో మాత్రమే పూర్తి స్థాయి ప్రవేశాలు జరిగాయి. జిల్లాలో ప్రైవేటు కళాశాలలు సుమారు 11 వరకు ఉండగా అందులో 5 కళాశాలు ఇప్పటికే మూతపడ్డాయి. ప్రస్తుతం నడుస్తున్న ఆరు కళాశాలలోనూ అడ్మిషన్లు 20 శాతం దాటకపోవడం గమనార్హం.

నేటి నుంచి తుది విడత ప్రవేశాలు

జిల్లాలోని పలు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏపీ పాలిసెట్‌ ద్వారా ఇప్పటికే కౌన్సెలింగ్‌ ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. ఇందులో భాగంగా సోమవారం వరకు విద్యార్థులకు బ్రాంచ్‌, కళాశాల మార్పునకు అవకాశం కల్పించారు. ఈ ప్రక్రియ ఈ నెల 23వ తేదీ నుంచి తుది విడత ప్రవేశాల్లో భాగంగా కొనసాగనుంది. అనంతరం మిగిలిన సీట్ల భర్తీకి వచ్చేనెల మొదటి వారంలో స్పాట్‌ అడ్మిషన్లకు అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తి కావడంతో తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో మాత్రమే పూర్తి స్థాయిలో సీట్లు భర్తీ అయ్యాయి. తిరుపతి మహిళా పాలిటెక్నిక్‌లో సైతం దాదాపు అన్ని సీట్లు భర్తీ కాగా లేటరల్‌ ఎంట్రీ సీట్లు 15 మిగిలినట్లు సమాచారం. అలాగే పుత్తూరులోని పిల్లారిపట్టు, చంద్రగిరి పాలిటెక్నిక్‌ కళాశాలలో 80 శాతం సీట్లు భర్తీ కాగా గూడూరు, సత్యవేడు ప్రభుత్వ కళాశాలలో దాదాపు 90 శాతం సీట్లు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం నడుస్తున్న ఆరు ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒక్కో కళాశాలలోని కొన్ని బ్రాంచ్‌ల్లో ఒక్క అడ్మిషన్‌ జరగపోవడం విశేషం.

న్యూస్‌రీల్‌

నాణ్యమైన విద్య, మౌలిక వసతుల కొరతే కారణం

జిల్లాలోని కొన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో అధ్యాపకులు కొరతతోపాటు, మెకానికల్‌, సివిల్‌, ట్రిపుల్‌ఈ, ఈసీఈ, సీఎస్‌ఈ వంటి కోర్సులకు అధ్యాపకుల కొరత వేధిస్తోంది. దీంతో పాటు అత్యాధునిక ల్యాబ్‌ సౌకర్యాలు, స్కిల్‌డెవలప్‌మెంట్‌పై విద్యార్థులకు పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వకపోవడం, మౌలిక సదుపాయాల కొరతతో ప్రవేశాలు దారుణంగా పడిపోయాయని విద్యావంతులు అభిప్రాయపడుతున్నారు. దీంతో పాటు కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ప్లేస్‌మెంట్‌ కల్పించడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో విద్యార్థులు మొగ్గు చూపడంలేదని తెలుస్తోంది. కోర్సు పూర్తి చేసుకున్న మెరిట్‌ విద్యార్థులకు బీటెక్‌లో ప్రవేశ పరీక్ష నిర్వహించకుండా అడ్మిషన్లు చేపడితే తప్ప వృత్తి విద్య కోర్సు పాలిటెక్నిక్‌కు మునుపటి ఆదరణ లభించదని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

అవగాహన లోపంతోనే అడ్మిషన్లు తగ్గుముఖం

పాలిటెక్నిక్‌ విద్యపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు చాలావరకు అవగాహన లేకపోవడంతో ఆ దిశగా ఆలోచించడం లేదు. నీట్‌, ఎంసెట్‌ అంటూ కొన్ని ప్రైవేటు సంస్థలు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మాయలో పడేసి వ్యాపారం చేసుకుంటున్నాయి. పాలిటెక్నిక్‌ డిప్లొమో పూర్తి చేసిన విద్యార్థులకు వంద శాతం ఉపాధి, ఉద్యోగ అవకాశాలున్నాయి. ఎంబీబీఎస్‌, బీటెక్‌ చేసిన విద్యార్థుల కంటే డిప్లొమో పూర్తి చేసిన విద్యార్థులు త్వరగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు సాధిస్తున్నారు.

–వాణిశ్రీ, కేంద్ర ప్రభుత్వ విశ్రాంత అధికారి, తిరుపతి

క్యాంపస్‌ డ్రైవ్‌లు లేమి

పాలిటెక్నిక్‌ డిప్లొమో చేసిన విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో అద్భుత అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు పేరొందిన ఎమ్‌ఎన్‌సీ కంపెనీలలో మంచి ప్యాకేజ్‌తో ఉపాధి లభిస్తుంది. అయితే పలు కళాశాలల్లో క్యాంపస్‌ డ్రైవ్‌లు లేక ఉద్యోగాలు దొరకడం లేదు. దీనికితోడు డిప్లొమో కోర్సులను నడుపుతున్న విద్యాసంస్థల్లో ప్రభుత్వం మౌలిక సదుపాయాలను కల్పించడం లేదు. ఈ దిశగా చర్యలు తీసుకుంటే ప్రతి పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలు పెరుగుతాయి. –పరమేశ్వర్‌రావు, రిటైర్డ్‌ అధ్యాపకులు, తిరుపతి

ప్రోత్సహించాలి

వృత్తి విద్యను అభ్యసించిన విద్యార్థులు 19, 20 ఏళ్లకే ఉద్యోగం సాధిస్తున్నారు. విద్యారంగంలో ఇంత చిన్న వయస్సులో మంచి ప్యాకేజ్‌తో ఉద్యోగం సాధించేందుకు అవకాశం ఉన్న కోర్సు పాలిటెక్నిక్‌ ఒక్కటేనని చెప్పవచ్చు. అయితే ఈ విద్య వైపు విద్యార్థులను ప్రోత్సాహించాలి. ఆ దిశగా కిందిస్థాయి విద్యాసంస్థలు, తల్లితండ్రులు విద్యార్థులను ప్రోత్సహించడం లేదు. కొన్ని ప్రైవేటు పాఠశాలలు నీట్‌, జేఈఈ శిక్షణ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయి. పాలిటెక్నిక్‌ విద్యను ప్రొత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.

– ప్రభాకర్‌రెడ్డి, ఓ ప్రైవేటు సంస్థ యజమాని, బెంగళూరు

పాలిటెక్నిక్‌ కోర్సుల్లో తగ్గుతున్న అడ్మిషన్లు 
1
1/6

పాలిటెక్నిక్‌ కోర్సుల్లో తగ్గుతున్న అడ్మిషన్లు

పాలిటెక్నిక్‌ కోర్సుల్లో తగ్గుతున్న అడ్మిషన్లు 
2
2/6

పాలిటెక్నిక్‌ కోర్సుల్లో తగ్గుతున్న అడ్మిషన్లు

పాలిటెక్నిక్‌ కోర్సుల్లో తగ్గుతున్న అడ్మిషన్లు 
3
3/6

పాలిటెక్నిక్‌ కోర్సుల్లో తగ్గుతున్న అడ్మిషన్లు

పాలిటెక్నిక్‌ కోర్సుల్లో తగ్గుతున్న అడ్మిషన్లు 
4
4/6

పాలిటెక్నిక్‌ కోర్సుల్లో తగ్గుతున్న అడ్మిషన్లు

పాలిటెక్నిక్‌ కోర్సుల్లో తగ్గుతున్న అడ్మిషన్లు 
5
5/6

పాలిటెక్నిక్‌ కోర్సుల్లో తగ్గుతున్న అడ్మిషన్లు

పాలిటెక్నిక్‌ కోర్సుల్లో తగ్గుతున్న అడ్మిషన్లు 
6
6/6

పాలిటెక్నిక్‌ కోర్సుల్లో తగ్గుతున్న అడ్మిషన్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement