
తిరుపతికి రిక్తహస్తం
రక్షణ ఛత్రం..
● ప్రధాన రైల్వేస్టేషన్లలో ముఖగుర్తింపు సాంకేతికత అమలు ● తిరుపతికి లభించని చోటు ● ప్రస్తుత పాలకుల తీరుకు నిదర్శనం
ప్రయాణికుల భద్రత..రక్షణతోపాటు నేర నియంత్రణ.. అసాంఘిక శక్తులపై ప్రత్యేక నిఘా.. ఉగ్రవాద మూకలకు అడ్డుకట్ట వేయడంలో ముఖగుర్తింపు సాంకేతికత అమలు ఎంతో కీలకం. ఈ టెక్నాలజీని రైల్వే మంత్రిత్వ శాఖ దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో అమలు చేస్తోంది. అయితే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుపతి రైల్వేస్టేషన్‌లో మాత్రం ఆ సాంకేతికత అమలు చేయడం లేదు. ఇందుకు ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం.. ఉదాశీనతే కారణమని తిరునగరి వాసులు ఆరోపిస్తున్నారు.
తిరుపతి అన్నమయ్యసర్కిల్: భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ దేశంలోని ఏడు ప్రధాన రైల్వేస్టేషన్లలో ముఖగుర్తింపు సాంకేతికతను ప్రవేశపెట్టింది. న్యూఢిల్లీ, ముంబై, చైన్నె, హౌరా స్టేషన్లలో అ మలు చేశారు. ఈ టెక్నాలజీ అనుమానితులను గుర్తించి, భద్రతను పటిష్ట పరచడంలో సహాయపడుతుంది. ముఖ గుర్తింపు సాంకేతికత ప్రయాణికుల సౌలభ్యాన్ని పెంచి, టికెట్ తనిఖీలను వే గవంతం చేస్తుంది. అయితే ఈ సాంకేతికత అమలులో తిరుపతికి చోటు దక్కలేదు.
తిరుపతికి లభించని చోటు
ముఖ గుర్తింపు సాంకేతికత అమలులో ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి రైల్వేస్టేషన్‌కు చోటు ల భించలేదు. ఇది ప్రస్తుత పాలకుల తీరుకు అద్దం పడుతోంది. శ్రీవారి దర్శనార్థం నిత్యం దేశ నలుమూలల నుంచి ప్రతిరోజు సుమారు లక్ష మంది రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో తిరుపతి రైల్వేస్టేషన్ ప్రయాణిలకుతో నిత్యం రద్దీగా ఉంటుంది. దీనికితోడు ఇటీవల దీన్ని ప్రపంచ ప్రఖ్యాత మోడల్ స్టేషన్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఇలాంటి ప్రముఖ రైల్వేస్టేషన్‌కు ముఖగుర్తింపు సాంకేతికతను ఏర్పాటు చేయడంలో రైల్వేశాఖ ఎందుకు మౌనంగా ఉందనేది ప్రశ్నార్థకంగా మారింది.
క్రిమినల్స్‌ను గుర్తించే అవకాశం
రైల్వే స్టేషన్లు రోజూ లక్షలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. ఇలాంటి చోట్ల దొంగతనాలు, అనుమానాస్పద వ్యక్తుల సంచారం, నేరా లు, ఉగ్రవాద చర్యలు జరిగే అవకాశం ఎక్కువ. అందుకే ఈ టెక్నాలజీని ఉపయోగించడంతో క్రిమినల్స్‌ను ముందుగానే గుర్తించడం, అనుమానితుల్ని ట్రాక్ చేయడం, భద్రతను పెంపొందించడం సాధ్యమవుతుంది. ముఖ గుర్తింపు టెక్నా లజీ సాంకేతిక పురోగతిలో ఒక పెద్ద అడుగు. ఇది భద్రత పెంపొందించడంలో సహాయపడుతుంది. అయితే దీనికి సంబంధించిన గోప్యతా సమస్యలు, ఖర్చును, సాంకేతిక లోపాలను కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
ముఖగుర్తింపు సాంకేతికత అంటే..
ఈ టెక్నాలజీ మన ముఖంలో ఉన్న లక్షణాలు, అందులో ముఖ్యంగా కళ్ల స్థానం, ముక్కు, నోరు, ముఖం ఆకారాన్ని గుర్తించి, వాటిని ఒక డేటాబేస్‌లో ఉన్న ఫొటోలతో పోల్చుతుంది. ఇది కృత్రిమ మేధస్సు (ఎ1), మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లపై ఆధారపడుతుంది. దీంతో నేర చరిత ఉన్నవారిని గుర్తిస్తుంది.

తిరుపతికి రిక్తహస్తం