పీ4 లక్ష్యం దిశగా అడుగులు | - | Sakshi
Sakshi News home page

పీ4 లక్ష్యం దిశగా అడుగులు

Jul 23 2025 6:00 AM | Updated on Jul 23 2025 6:00 AM

పీ4 ల

పీ4 లక్ష్యం దిశగా అడుగులు

తిరుపతి అర్బన్‌: ీప–4 లక్ష్యం దిశగా అడుగులు వేయడానికి సంపన్నులు ముందుకు రావాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆయన జేసీ శుభం బన్సల్‌, డీఆర్వో నరసింహులతో కలసి అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఆర్థిక అసమానతలను తగ్గించడానికి సర్కార్‌ పీ–4 ప్రాజెక్టును తీసుకొచ్చిందని వెల్లడించారు. సర్వేలో తేలిన లెక్క ప్రకారం జిల్లాలోని అన్ని బంగారు కు టుంబాలను దత్తత తీసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. వచ్చే ఆగస్టు 15 నాటికి పీ–4 లక్ష్యానికి చేరుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. అట్టడుగు పేదరికంలోని 20 శాతం మంది బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడానికి మార్గదర్శకులు(దాతలు) ముందుకు రావాల ని కోరారు. అలాగే ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలకు తప్పకుండా పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. అర్జీదారులతో మర్యాదగా వ్యవహరించాలని చెప్పారు. ప్రధానంగా మండల, డివిజన్‌ స్థాయిల్లోను తప్పకుండా ప్రతి సోమ వారం గ్రీవెన్స్‌ నిర్వహించాలని చెప్పారు. కార్యక్రమంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రోస్మాండ్‌, ప్రణాళిక విభాగం జిల్లా అధికారి వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌వో బాలకృష్ణనాయక్‌, డీఏఓ ప్రసాద్‌రావు, డీఎస్‌వో శేషాచలం రాజు పాల్గొన్నారు.

వైద్యసేవల ధరలు

నోటీస్‌ బోర్డులో ఉంచాలి

తిరుపతి తుడా: జిల్లా లోని ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌లు, ల్యా బ్‌లు, డయాగ్నస్టిక్‌ సెంటర్లు నిర్వహించే యజమానులు ప్రజలకు తెలిసేలా వైద్యసేవల ధరల పట్టికను నోటీసు బోర్డుల్లో తప్పక ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ బాలకృష్ణ నాయక్‌ తెలిపారు. ఆయన మాట్లాడుతూ చట్టం ప్రకారం ప్రతి ప్రైవేటు ఆస్పత్రిలో ఆ సంస్థ వారు అందించే ప్రతి సేవకు వసూలు చేసే ధరల వివరాలను స్థానిక, ఆంగ్ల భాషల్లో రిసెప్షన్‌ కౌంటర్‌లో కనిపించేలా ప్రదర్శించాలని ఆదేశించా రు. ఆస్పత్రి యాజమాన్యం వసూలు చేస్తే రేట్ల వివరాలను వారంలోపు demotirupati @gmail.comకు ఈమెయిల్‌ ద్వారా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి విధిగా అందజేయాలని సూచించారు. వారం లోపు వివరాలను పంపని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

శ్రీవారి దర్శనానికి 18 గంటలు

తిరుమల: తిరుమలలో క్యూ కాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. క్యూ ఏటీ జీహెచ్‌ వద్దకు చేరుకుంది. సోమవారం అర్ధరాత్రి వరకు 77,481 మంది స్వామివారిని దర్శించుకోగా 30,612 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.96 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

ఎస్వీయూ ఆర్ట్స్‌ కళాశాల మ్యాగజైన్‌ ఆవిష్కరణ

తిరుపతి సిటీ:ఎస్వీయూ ఆర్ట్స్‌ కళాశాల 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ‘ఆరా ఆఫ్‌ ఆర్ట్స్‌ మ్యాగజైన్‌’ను వీసీ ఆచార్య అప్పారావు, రిజిస్ట్రార్‌ ఆచార్య భూపతి నాయుడు, ప్రిన్సిపల్‌ ఆచార్య సుధారాణి మంగళవారం వర్సిటీలో ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ ఎంతో గణనీయమైన చరిత్ర కలిగిన యూనివర్సిటీ ఆర్ట్స్‌ వి భాగం కార్యాలయం ప్రకాశం భవనంలో ఉండడం, అలాగే ఆర్ట్స్‌ కళాశాల పేరు ప్రతిబింబించే లా ఆరా పేరుతో ఈ మ్యాగజైన్‌ తీ సుకుని రావ డం హర్షణీయమన్నారు. మ్యాగజైన్‌లో విద్యార్థు ల కవితలు, వ్యాసాలు, వివిధ శాఖల పురోభివృద్ధి, జాతీయ, అంతర్జాతీయ సదస్సుల నిర్వహణ, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడల్లో సాధించిన విజయాలు వంటి వాటితో ప్రకాశిస్తుందని, ఇది దాదాపు 200 పైచిలుకు పుటలు కలిగిన డాక్యు మెంటరీ వంటి పుస్తకమన్నారు. వైస్‌ ప్రిన్సిపల్‌ ఆచార్య భాస్కర్‌ రెడ్డి, పాలకమండలి సభ్యులు ఆచార్య సుమకిరణ్‌, వార్డెన్‌ ఆచార్య ప్రయాగ, ఆచార్య రాజేశ్వరమ్మ, ఆచార్య అమీనుల్లా, డాక్టర్‌ ఓబులేసు, రాజు, శ్రీధర్‌ పాల్గొన్నారు.

పీ4 లక్ష్యం దిశగా అడుగులు 1
1/1

పీ4 లక్ష్యం దిశగా అడుగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement