
అక్రమ అరెస్టులతో అణచివేయలేరు
● ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టు అనైతికం ● వైఎస్సార్ సీపీ సత్యవేడు సమన్వయ కర్త నూకతోటి
బుచ్చినాయుడుకండ్రిగ: అక్రమ అరెస్టులతో వైఎస్సార్‌సీపీని అణచివేయలేరని వైఎస్సార్ సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ అన్నారు. మంగళవారం బుచ్చినాయుడు కండ్రిగలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిసి ఆయన ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి చర్యలతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల్లో ప్రతీకారం, కోపం, పట్టుదలను మరింత పెంచి, కసితో ప్రభుత్వ కుట్రలను ఎదుర్కొనేలా చేస్తాయని తెలిపారు. రాజకీయంగా పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక సీఎ చంద్రబాబు తప్పుడు కేసులతో వారిని అణచివేయాలని చూస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ నా యకులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి పోరాటాలు, ఉద్యమాలు, నిరసనల ద్వారా కూటమి ప్రభుత్వ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళతామన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి, కేవటం రాజకీయ వేధింపులతో అక్రమ అరెస్టులు చేస్తూ కూటమి నాయకులు రాక్షస ఆనందం పొందుతున్నారని విమర్శించారు.